8th Pay Commission : బిగ్ అప్డేట్.. జీతాలు, పెన్షన్లు పెరగాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లు ఈ తేదీలోపు ఇలా చేయండి..
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సుల ప్రకారం కొత్త జీతాలు, పెన్షన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధికారిక నోటీసు విడుదల చేసింది. ఈ డిమాండ్లు నెరవేరితే గతంలో లేనంతగా జీతాలు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
8th Pay Commission
- 8వ వేతన సంఘం సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్
- కొత్త జీతాలు, పెన్షన్ నిర్మాణంపై కేంద్రం అధికారిక నోటీసులు జారీ
- ఎన్నడూ లేనంతంగా భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త. అందరిచూపు జీతాలు ఎంత పెరుగుతాయి? పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయా? ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారిక నోటీసు జారీ చేసింది. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కొత్త జీతాలు, పెన్షన్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది.
ఇటీవలే అధికారిక నోటీసు విడుదల చేసిన ప్రభుత్వం కొత్త జీతాల నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, నిపుణులు, వారి సంఘాల నుంచి ప్రతిపాదనలు, సూచనలను సేకరిస్తోంది. ఈ సలహాలు, డిమాండ్లు పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగులు తమ ప్రాథమిక జీతాలను ఇప్పటివరకు ఎన్నడూ చూడని స్థాయికి పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా లబ్ధం పొందవచ్చు.
ఏప్రిల్ 30 నాటికి మీ సూచనలను సమర్పించండి :
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. 8వ వేతన సంఘం నవంబర్ 3, 2025న ఏర్పడింది. కమిషన్ ఇప్పుడు అభిప్రాయ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని ప్రతిపాదనలు MyGov పోర్టల్ లేదా కమిషన్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
పోస్ట్, ఇమెయిల్ లేదా పీడీఎఫ్ ద్వారా పంపిన సూచనలు పరిగణనలోకి తీసుకోరు. అలాగే సూచనలను సమర్పించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2026 వరకు ఉంది. అప్పటిలోగా కమిషన్ ప్రతిపాదించిన సూచనలకు మీ అభిప్రాయాలను తెలియజేయొచ్చు.
బేసిక్ పేలో 66శాతం వరకు భారీ పెంపు? :
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో జీతాల పెంపును ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కమిషన్ యూనియన్ల సిఫార్సులను అంగీకరిస్తే.. ప్రాథమిక జీతాలు 66శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, కనీస ప్రాథమిక జీతం రూ. 18,000 ఉండగా రూ. 26,000 నుంచి రూ. 30,000 మధ్య పెంచే దిశగా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
70 ఏళ్ల ఫ్యామిలీ ఫార్ములా మారుతుందా? :
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం నిర్ణయించేందుకు 1956 నాటి పాత సూత్రాన్ని వాడుతున్నారు. దీన్నే ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ మోడల్ అంటారు. ఇందులో కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ (భర్త, భార్య, ఒక బిడ్డ) ఉంటుంది.
అయితే, ఇప్పుడు ఈ ఫ్యామిలీ మోడల్లో తల్లిదండ్రులను కూడా చేర్చాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పిల్లల బాధ్యతలు పెరుగుతున్న క్రమంలో కుటుంబ యూనిట్‌ను 3 నుంచి ఐదుగురు సభ్యులకు విస్తరించాలని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. కొత్త జీతం గణన దీని ఆధారంగానే చేయాల్సి ఉంటుంది.
అలవెన్సులు, పెన్షన్లపై రివ్యూ :
8వ వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడమే కాకుండా ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA), పెన్షనర్లకు ప్రయోజనాలను సమీక్షిస్తుంది. ఏప్రిల్ 30 నాటికి అందిన సూచనలను అధ్యయనం చేశాక కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
