Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఇందుకిలా జరుగుతోంది.. నేటి రేట్లు ఇవే..
Gold And Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. కొద్దిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన పదిరోజుల్లో గోల్డ్ రేటు ఊహించని స్థాయికి చేరింది.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 2,400 వరకు పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే, గోల్డ్ రేట్లు ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 23డాలర్లు తగ్గింది.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,392 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,890 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,900 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,040 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,900 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
