Summar AC Offers : బాబోయ్ ఎండ దంచేస్తోంది.. కొత్త AC కావాలా? రూ. 35వేల లోపు 1.5 టన్ బెస్ట్ స్ప్లిట్ ఏసీలు.. సమ్మరంతా చిల్ అవ్వండి!
Summar AC Offers : ఈ వేసవిలో ఎండలు తట్టుకోలవాలంటే ఇంట్లో ఏసీ ఉండాల్సిందే.. ప్రస్తుతం మార్కెట్లో 1.5 టన్ బెస్ట్ స్ప్లిట్ ఏసీలు సరసమైన ధరలో లభిస్తున్నాయి. ఏసీల ధరలు ఎలా ఉన్నాయంటే?
Summar AC Offers
- వేసవి ఆరంభంలోనే దంచికొడుతున్న ఎండలు
- ఏసీలు కొనేందుకు ఎగబడుతున్న వినియోగదారులు
- సరసమైన ధరలో 1.5 టన్ బెస్ట్ స్ప్లిట్ ఏసీలు ఇవే
- రూ. 35వేల లోపు ధరలో అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త ఏసీలు
Summar AC Offers : సమ్మర్ వచ్చేసింది.. మెల్లగా ఎండలు పెరుగుతున్నాయి. ఉక్కపోత కూడా మొదలైంది.. అందరూ పాత ఏసీలు, కూలర్లకు పనిచెబుతున్నారు. కొత్త ఏసీలు కొనేవారు ఆఫర్ల కోసం చూస్తున్నారు. మీరు కూడా కొత్త ఏసీ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన సరసమైన ధరకే కొత్త ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇల్లు అయినా ఆఫీసు కోసమైనా మంచి ఏసీని కొనేసుకోవచ్చు.
మీ బడ్జెట్ రూ. 35,000 కన్నా తక్కువగా ఉంటే మాత్రం మార్కెట్లో అనేక అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి. లేటెస్ట్ ఏసీ మోడల్స్ పవర్ ఆదా చేయడమే కాకుండా వంద శాతం కాపర్ కండెన్సర్లు, స్మార్ట్ కన్వర్టిబుల్ మోడ్ల వంటి అడ్వాన్స్ ఫీచర్లతో లభిస్తున్నాయి. తక్కువ ధరలో కూలింగ్ అందించే హిటాచీ, ఎల్ జీ, డైకిన్, బ్లూ స్టార్ వంటి మెయిన్ బ్రాండ్ల నుంచి ఎంపిక చేసిన ఏసీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఎక్స్‌పాండబుల్+ ఇన్వర్టర్ ఏసీ :
హిటాచీ నుంచి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ మోడల్ మీడియం సైజు గదికి చాలా బెస్ట్. ఎక్స్‌పాండబుల్+ టెక్నాలజీతో వస్తుంది. గది ఉష్ణోగ్రత ఆధారంగా కూలింగ్ అందిస్తుంది. వంద శాతం కాపర్ కండెన్సర్ ఎక్కువ కాలం లైఫ్, లో మెయింట్ నెన్స్ ఖర్చులు ఉంటాయి. లోపల పేరుకుపోయిన మురికిని క్లీన్ చేస్తుంది. స్వచ్ఛమైన గాలి కోసం ‘ఐస్ క్లీన్’ ఫీచర్ కూడా ఉంది. రూ. 32,999 ధరకే 4-వే స్వింగ్‌తో వస్తుంది. గది ప్రతి మూలలో ఒకేలా కూలింగ్ అందిస్తుంది.
హిసెన్స్, లాయిడ్ ఏసీలు :
మీ బడ్జెట్ రూ. 31వేల ధరలో మంచి ఏసీ కోసం చూస్తుంటే.. Hisense Lloyd ఏసీలను చూడొచ్చు. 1.5-టన్ మోడల్‌లు చాలా అద్భుతంగా ఉంటాయి. హిసెన్స్ ఏసీ మోడల్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌ను అందిస్తుంది.
పవర్ ఆదా కోసం రిమోట్‌గా కంట్రోల్ చేయొచ్చు. లాయిడ్ ఏసీలు బ్యాక్టీరియా, ధూళి కణాలను తొలగించే యాంటీ-వైరల్ ఫిల్టర్‌తో వస్తుంది. ఈ రెండు ఏసీలో కూడా PM2.5 ఫిల్టర్ ఉంది. ఎయిర్ క్లీన్ చేస్తుంది. ఈ మోడల్‌లు రూ. 30,990 నుంచి రూ.31,990 వరకు అందుబాటులో ఉన్నాయి.
డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ :
డైకిన్ ఏసీలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. రూ. 34,490 ధరకు లభించే ఈ మోడల్లో కోండా ఎయిర్‌ఫ్లో టెక్నాలజీ ఉంది. చల్లని గాలిని నేరుగా కాకుండా గది అంతటా వ్యాపించేలా చేస్తుంది. డ్యూక్లీన్ టెక్నాలజీని కూడా ఉంది. ఏసీ లోపల పేరుకుపోయే తేమ, బూజును ఆటో క్లీన్ చేస్తుంది. ట్రిపుల్ డిస్ప్లేతో ఈ ఏసీ వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఈజీగా తట్టుకోగలదు. స్టెబిలైజర్ అవసరం ఉండదు.
ఎల్జీ 1 టన్ 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ :
ఎల్జీ 1-టన్ 4-స్టార్ ఏసీ చిన్న గదులు, బెడ్రూమ్లకు అద్భుతంగా ఉంటుంది. ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్‌తో వస్తుంది. గదిలో ఎంతమంది ఉన్నా తగినట్టుగా కూలింగ్ అందిస్తుంది. ఆటో సెన్సార్ల ద్వారా ఏసీ కూలింగ్ అవుతుంది. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కూడా బాగుంది. ఎక్కువ పవర్ ఆదా చేస్తుంది. HD ఫిల్టర్లు, యాంటీ-వైరస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఏసీ ధర రూ.34,490 ధర వద్ద లభిస్తుంది.
బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ వై-ఫై స్మార్ట్ ఏసీ :
మంచి ఏసీ కోసం చూస్తున్నారా? బ్లూ స్టార్ నుంచి వచ్చిన ఈ 5-స్టార్ మోడల్ తీసుకోవచ్చు. Wi-Fi కనెక్టివిటీతో వస్తుంది. మీ మొబైల్ యాప్ నుంచే ఏసీని ఆన్ చేయవచ్చు. టెంపరేచర్ కచ్చితంగా కంట్రోలింగ్ కోసం డిజిక్యూ హెప్టా సెన్సార్‌తో వస్తుంది. 5-స్టార్ రేటింగ్ కారణంగా సమ్మర్ సీజన్ మొత్తం మీకు పవర్ బిల్లులు తక్కువగా వస్తాయి. ఈ ఏసీ ధర దాదాపు రూ. 34,790 ఉంటుంది. స్మార్ట్ ఫీచర్ల కోసమైనా ఈ ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
