TVS Sport 2026 : రూ. 10,000 డౌన్ పేమెంట్ కట్టి ఈ TVS స్పోర్ట్ బైక్ ఇంటికి తెచ్చుకోండి.. లీటర్ కొట్టిస్తే 70కి.మీ మైలేజ్ పక్కా..
TVS Sport 2026 : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు టీవీఎస్ లవర్స్ అయితే ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోండి. రూ. 10వేలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
TVS Sport 2026
- టీవీఎస్ స్పోర్ట్ బైక్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోండి
- రూ. 10వేలు డౌన్ పేమెంట్.. నెలకు ఈఎంఐ ఎంతంటే?
- హీరో HF100, బజాజ్ సీటీ 110X బైకులకు పోటీగా
TVS Sport 2026 : కొత్త బైకు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయ మిడిల్ క్లాసు ఫ్యామిలీలు, ఆఫీసులకు వెళ్లే యువకులు ఈ టీవీఎస్ బైక్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలోనే పెట్రోల్ సేవింగ్స్ కోసం చూస్తుంటే ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ కొనేసుకోవచ్చు.
ఎక్కువ కాలం మన్నిక, అద్భుతమైన మైలేజ్ కారణంగా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. తక్కువ మెయింట్‌నెన్స్ ఖర్చులతో టీవీఎస్ స్పోర్ట్ సరసమైన మాస్టర్‌స్ట్రోక్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 64,431 ప్రారంభ ధరతో ఈజీ ఈఎంఐ ప్లాన్‌తో ఈ బైక్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
టీవీఎస్ స్పోర్ట్ ఆన్-రోడ్ ధర :
టీవీఎస్ స్పోర్ట్ ప్రత్యేకంగా సిటీ ట్రాఫిక్, రోజువారీ ప్రయాణాల కోసం అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీలో సెల్ఫ్ స్టార్ట్ ఈఎస్ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 64,431 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రెండు మెయిన్ వేరియంట్లలో వస్తుంది.
అల్లాయ్ వీల్స్, సెల్ఫ్-స్టార్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది. రాష్ట్ర పన్నులు, ఆర్టీఓ ఛార్జీలను బట్టి ధర కొద్దిగా మారవచ్చు. తక్కువ ధరలో హీరో HF100, బజాజ్ సీటీ 110X వంటి బైకులతో పోటీపడుతుంది.
కేవలం రూ. 10వేలు డౌన్‌పేమెంట్ :
ఒకేసారి మొత్తం డబ్బులు కట్టలేకపోతే డోంట్ వర్రీ.. కస్టమర్ల కోసం టీవీఎస్ ఈజీ ఫైనాన్స్ ప్లాన్‌ను అందిస్తోంది. కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్ ద్వారా సుమారు రూ. 54,431 బ్యాంక్ లోన్ అందిస్తోంది.
9.7శాతం అంచనా వడ్డీ రేటుతో మీరు 3 ఏళ్లు (36 నెలల) కాలపరిమితిని ఎంచుకోవచ్చు. మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 1,749 అవుతుంది. 42 నెలలు ఎంచుకుంటే మీ ఈఎంఐ కేవలం రూ. 1,534కి తగ్గుతుంది. అయితే, ఫైనల్ వడ్డీ రేటు మాత్రం ఈఎంఐ, మీ సిబిల్ స్కోర్, ఫైనాన్స్ కంపెనీ పాలసీలపై ఆధారపడి ఉంటుంది.
70kmpl భారీ మైలేజ్ :
టీవీఎస్ స్పోర్ట్ బైకులో మైలేజ్ చాలా మెయిన్. ఈ బైక్ లీటర్ కు 70 కి.మీకు పైగా మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ రోజువారీ ఆఫీసు ప్రయాణికులకు వరం. నెలవారీ పెట్రోల్ ఖర్చులను భారీగా తగ్గుతాయి. 109.7cc ఇంజిన్ ఇంధన సామర్థ్యం మాత్రమే కాకుండా రోడ్డుపై చాలా స్మూత్ గా దూసుకెళ్తుంది. 90kph టాప్ స్పీడ్‌తో హైవేపై కూడా వేగంగా దూసుకెళ్లొచ్చు.
రైడింగ్ కంఫర్ట్, అడ్వాన్స్డ్ సెన్సార్లు :
టీవీఎస్ కంపెనీ సౌకర్యవంతమైన రైడ్ కోసం అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ అందించింది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కఠినమైన రోడ్లు, గుంతల్లో కూడా స్మూత్ గా వెళ్లగలదు. ఎక్కువ దూరం వెళ్లేవారికి వెన్నునొప్పి, అలసట ఉండదు. సేఫ్టీ కోసం సడన్ బ్రేకింగ్ సమయంలో కూడా బ్యాలెన్స్ అయ్యేలా పవర్ ఫుల్ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
