Property Documents : మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయా..? కంగారుపడాల్సిన పనిలేదు.. ఇలాచేయండి!
Property Documents : ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. ఈ సూచనలు ఫాలో అయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడొచ్చు.
Property Documents
Property Documents : ఇల్లు, పొలాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను మనం ఎంతో జాగ్రత్తగా భద్రపర్చుకుంటాం. చాలా మంది ఆస్తిపత్రాలను ఇంటిలోని బీరువాల్లో సురక్షితంగా దాచుకుంటారు. అయితే, కొన్నిసార్లు మీరు ఇల్లు మారే సమయంలోనో.. మీ వెంట తీసుకెళ్లే సమయంలోనో లేదంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. అయితే, అంత ఆందోళన పడాల్సిన పనిలేదు. మీ ఒరిజినల్ ఆస్తిపత్రాలు పోయినంతమాత్రాన.. మీ ఇంటిపై లేదా భూమిపై యాజమాన్య హక్కులు కోల్పోయినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. డాక్యుమెంట్లు నిజంగానే పోయినట్లు నిర్ధారణ అయితే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. పోలీసులు పరిస్థితిని బట్టి ఎన్సీఆర్ లేదంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీ పత్రాలు దుర్వినియోగం కాకుండా ఉండటానికి, చట్టపరమైన ప్రక్రియల కోసం అధికారిక రికార్డుగా ఉపయోగపడుతుంది.
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోయిన సమయంలో పోలీస్ స్టేషన్మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయా..? కంగారుపడాల్సిన పనిలేదు.. ఇలాచేయండి!లో ఫిర్యాదు చేయడంతోపాటు.. ప్రముఖ వార్తాపత్రికల్లో పబ్లిక్ ప్రకటన జారీ చేయాలి. ఒకవేళ ఆ పత్రాలు ఎవరి వద్దనైనా ఉంటే అభ్యంతరాలు తెలపడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అలాగే పత్రాలు పోయిన వెంటనే మీరు బాధ్యతాయుతంగా చర్యలు తీసుకున్నారనే దానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఈ నోటీస్ కాపీ ఒక బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
మీ ఆస్తి పత్రాలు ఎలా పోయయనే విషయాన్ని వివరంగా తెలుపుతూ ఒక నోటరీ సమక్షంలో అఫిడవిట్ చేయించుకోండి. దీనివల్ల భవిష్యత్తులో మీరు బ్యాంక్ వ్యవహారాలు పూర్తి చేసుకోవడానికైనా, ఆస్తిని విక్రయించాలన్నా ఈ అఫిడవిట్, ఇండెమ్నిటీ బాండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం.. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ను ప్రభుత్వ రికార్డుల్లో భద్రంగా ఉంచుతారు. కాబట్టి మీ ఆస్తి పత్రాలు పోతే.. సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ కాపీ (Certified Copy) కోసం దరఖాస్తు చేసుకోండి. వారు మీకు అధికారిక సర్టిఫైడ్ కాపీని అందజేస్తారు. ఇది చట్టపరంగా ఒరిజినల్ పత్రంతో సమానమైన విలువను కలిగి ఉంటుంది.
ఒకవేళ మీ ఆస్తిపత్రాలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్న సమయంలో.. బ్యాంకులో మీ పత్రాలు పొరపాటు కాలిపోవటమో లేదంటే బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ పత్రాలు పోవటమో జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ఆ బ్యాంకుదే అవుతుంది. బ్యాంకు తమ సొంత ఖర్చులతో అవసరమైన పత్రాలను తిరిగి ఇప్పించడంతో పాటు బాధితుడికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
