Shortest Train Journey In India : ఇదేం రైలు ప్రయాణం బాబోయ్.. 3కిలోమీటర్లు.. 7నిమిషాలు..! ఈ రూట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Shortest Train Journey In India :భారత దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో బోరి బందర్ (అప్పటి బాంబే) నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు మార్గం ప్రయాణం 34 కిలో మీటర్లు. అయితే, నాగ్ పూర్ - అజ్ని స్టేషన్ల మధ్య రైలు ప్రయాణం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.
India's Shortest Train Journey Nagpur and Ajni stations
Shortest Train Journey In India : సాధారణంగా రైలు ప్రయాణం అంటే గంటల కొద్దీ ప్రయాణం, వందల కిలోమీటర్లు దూరం గుర్తుకొస్తాయి. కానీ, భారతదేశంలో ఒక రైలు ప్రయాణం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం మూడు కిలోమీటర్లు దూరం.. ఏడు నుంచి తొమ్మిది నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుంది.
Also Read : Shravana Masam 2026 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..
ఈ ప్రత్యేకమైన చిన్న రైలు ప్రయాణం మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ జంక్షన్ నుంచి అజ్ని రైల్వే స్టేషన్ల మధ్య ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. నాగపూర్ నగరంలోని ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నాగ్‌పూర్ జంక్షన్, అజ్ని రెండూ సమీప రైల్వే స్టేషన్లు అయినప్పటికీ.. ఈ రెండు స్టేషన్లు రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇతర గమ్యస్థానాలకు వెళ్లే రైళ్లు ఈ రెండు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. అధికశాతం రైళ్లు ఈ రెండు స్టేషన్లలో ఆగుతాయి. దీంతో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి రైలు ద్వారా నేరుగా, త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణికుల కోసం ఇది ఆసక్తికరమైన అనుభవంగా మారడానికి ప్రధాన కారణం దూరం కంటే ప్రయాణ సమయం. మూడు కిలోమీటర్ల రైలు ప్రయాణం 7-9 నిమిషాల్లో పూర్తవుతుండటంతో ఈ మార్గం గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
భారత దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో బోరి బందర్ (అప్పటి బాంబే) నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు మార్గం ప్రయాణం 34 కిలో మీటర్లు. అదే సమయంలో నాగ్ పూర్ – అజ్ని రైలు ప్రయాణం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.. అంటే భారతదేశపు తొలి ప్యాసింజర్ రైలు ప్రయాణం కంటే ఈ దూరం పదోవంతు కంటే కూడా తక్కువ. ఈ రెండు స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణించే ప్రయాణికులు.. రైలు ఎక్కి ఒక పాట వినడం పూర్తయ్యేలోపే గమ్యస్థానంకు చేరుకోవచ్చు.
ఛార్జీ ఎంతంటే?
నాగ్‌పూర్ – అంజి రైల్వే స్టేషన్ల మధ్య రూట్లో ఆశ్చర్యపరిచే మరో విషయం ఛార్జీలు. ప్రయాణించే కోచ్, క్లాస్‌ను బట్టి టికెట్ ధరలో భారీ వ్యత్యాసం ఉంటుంది. జనరల్ క్లాస్‌కు రూ.60, స్లీపర్ క్లాస్‌కు రూ.145-175, ఏసీ 3-టైర్‌కు రూ.555, ఏసీ 2-టైర్‌కు రూ.760, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.1,255 వరకు ఉంటుంది.
