Nani : ఫేక్ కలెక్షన్స్ కాదు.. నాని కౌంటర్ ఇచ్చాడా? డిస్ట్రిబ్యూటర్ లెక్కల షీట్లు తీసుకొచ్చి..
నాని ది ప్యారడైజ్ సినిమా ఇటీవల రిలీజయి నాలుగు రోజుల్లో 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. (Nani)
Nani
Nani : ఇటీవల ఎంత హిట్ సినిమాలైనా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేస్తున్నామని నిర్మాతలే స్వయంగా చెప్తున్నారు. నాగవంశీ, దిల్ రాజు.. వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలు, నిర్మించిన సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వేస్తున్నామని, ఫేక్ పోస్టర్స్ వేస్తున్నామని ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్ వార్స్ వల్లే అని చెప్పడంతో ఆ కామెంట్స్ చర్చగా మారాయి. దీంతో ఏ హీరో సినిమా కలెక్షన్స్ అనౌన్స్ చేసినా వేరే హీరోల అభిమానులు అవి ఫేక్ అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాని ది ప్యారడైజ్ సినిమాకు కూడా ఇలాంటివి వస్తాయేమో అని ముందే గ్రహించి ఓ కొత్త ప్రమోషన్ చేసాడు.
నాని ది ప్యారడైజ్ సినిమా ఇటీవల రిలీజయి నాలుగు రోజుల్లో 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగానే ప్రకటించింది. కొంతమంది సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది కదా అన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయి, ఫేక్ పోస్టర్స్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో కలెక్షన్స్ నిజమే అని చెప్పడానికి నాని నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశిధర్ ని తీసుకొచ్చారు.
Also Read : Dhashvika Kinthalli : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. వైజాగ్ భామ దష్విక ఫొటోలు..
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ సినిమా ప్రీమియర్స్ నుంచి మొదలుపెట్టి, ఎన్ని షోలు పడ్డాయి, ఎంతమంది ప్రేక్షకులు వచ్చారు, ఎక్కడ ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పడమే కాకుండా కొన్ని పేపర్లు బయటకు తీసి ఆ లెక్కలకు సంబంధించిన డేటా షీట్లు చూపించారు. వాటిని నానికి మల్టీప్లెక్సుల్లో ఇంత, సింగిల్ స్క్రీన్స్ లో ఇంత అంటూ నంబర్లు చెప్పారు. దీంతో నాని తన సినిమాకు వచ్చినవి నిజం కలెక్షన్స్ ఫేక్ కాదు అని చెప్పడానికే ఇలా డిస్ట్రిబ్యూటర్ ని తీసుకొచ్చి లెక్కలు చెప్పించారని, ఫేక్ కలెక్షన్స్ అనేవాళ్లకు కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.
సినీ పరిశ్రమలో కెమెరా ముందుకు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసాము కానీ ఇలా హీరో దగ్గరకు డిస్ట్రిబ్యూటర్స్ కెమెరా ముందుకు వచ్చి కలెక్షన్స్ లెక్కలు చెప్పడం ఇదే మొదటిసారి. మొత్తానికి ఈ ఇంటర్వ్యూతో నాని ది ప్యారడైజ్ కలెక్షన్స్ నిజమే అనే సంకేతాలు అయితే ఇచ్చారు.
Also Read : Megastar Chiranjeevi : హోస్ట్ గా మెగాస్టార్.. పెద్ద ఓటీటీతో కలిసి స్పెషల్ పాడ్ కాస్ట్ షో..?
నాని – శ్రీకాంత్ ఓదెల – డిస్ట్రిబ్యూటర్ శశిధర్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
