LPG Refill Booking Rule : వావ్.. సూపర్ గుడ్ న్యూస్.. గ్యాస్ బుకింగ్ ఇప్పుడు ఈజీ.. ఇక 25 రోజులకే రీఫిల్..!
LPG Refill Booking Rule : గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తాజా నిర్ణయాన్ని మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.
LPG Refill Booking Rule
- ఎల్పీజీ కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్.. 25 రోజులకే రీఫిల్ బుకింగ్
- గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువు తగ్గింపు
- ఎల్పీజీ రీఫిల్‌పై ఆంక్షలు సడలింపు.. కేంద్రం తాజా ప్రకటన
LPG Refill Booking Rule : గ్యాస్ బుకింగ్ కోసం చూస్తున్నారా? ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ వినియోగదారులకు నిజంగా సూపర్ గుడ్ న్యూస్..
డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఇక 25 రోజుల్లోనే రీఫిల్ బుకింగ్ :
ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా 25 రోజుల వ్యవధిలోనే ఎల్పీజీ గ్యాస్ రీఫిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 45 రోజులుగా ఉంది. తాజాగా 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.
ఎల్పీజీ సరఫరా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బుకింగ్‌లు భారీగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా తన పోస్టులో షేర్ చేశారు.
Read Also : Multiple PF Accounts : ఉద్యోగాలు మారారా? మీ పేరుతో ఎన్ని PF ఖాతాలు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేయండి
అందుకే బుకింగ్ వ్యవధిలో మార్పులు :
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా కొరత ఏర్పడింది. గతంలో బుకింగ్ వ్యవధిలో మార్పులు చేసినట్లు ఆయన వివరించారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగిన యుద్ధం, హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెప్పారు. దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బుకింగ్ వ్యవధిని మార్చినట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరా వ్యవస్థ మెరుగుపడిందని, దాంతో ప్రభుత్వం కూడా గ్యాస్ వినియోగంపై ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా లేకుండా గృహ వినియోగదారులందరూ 25 రోజుల వ్యవధిలో రీఫిల్ బుక్ చేసుకోవచ్చునని మంత్రి స్పష్టం చేశారు.
ఇదివరకే, వాణిజ్య ఎల్పీజీ సరఫరాపైనా ప్రభుత్వం పరిమితులను విధించగా తాజాగా సడలించింది. ఇండస్ట్రీ పరమైన కార్యకలాపాలకు అవసరమైన గ్యాస్ సరఫరాను క్రమంగా సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది.
