Aditya Hasan : విదేశాల్లో విద్యార్థులు, రిలేషన్స్.. ‘ఎపిక్’ సినిమాపై దర్శకుడు ఆదిత్య హాసన్ కామెంట్స్..
దర్శకుడు ఆదిత్య హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (Aditya Hasan)
Aditya Hasan
Aditya Hasan : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు దర్శకుడు ఆదిత్య హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆదిత్య హాసన్ తన గురించి చెప్తూ… మాది వనపర్తి. టెన్త్ వరకు అక్కడే చదివి తర్వాత హైదరాబాద్ వచ్చాను. తర్వాత మాస్టర్స్ కోసం లండన్ వెళ్ళాను. నేను కమల్ హాసన్ ఫ్యాన్ ని అందుకే నా పేరు పక్కన హాసన్ అని పెట్టుకున్నాను. మాస్టర్స్ చేసే సమయంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. యూకే నుంచి తిరిగి వచ్చాక సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి కలర్స్ స్వాతితో టీచర్ అనే సినిమా చేశాను. కానీ నిర్మాతల వివాదాల వల్ల ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆహాలో 90స్ సిరీస్ కొన్నాళ్ళు చేద్దామన్నారు కానీ చేయలేదు. దాంతో ఈటీవీ విన్ కి వెళ్లి అది సెలెక్ట్ అయింది. అక్కడ 90స్ సిరీస్ రిలీజ్ అయి హిట్ అయింది. తర్వాత లిటిల్ హార్ట్స్ నిర్మించాను అని అన్నారు.
Also See : Debjani Modak : బిగ్ బాస్ 10 లోకి వచ్చిన దేబ్జానీ మోదక్.. ఈ సీరియల్ నటి ఫొటోలు చూశారా..?
ఎపిక్ సినిమా అవకాశం గురించి మాట్లాడుతూ.. 90s సిరీస్ చూసి నాగవంశీ గారు పిలిచి సినిమా చేద్దామన్నారు. 90s సిరీస్ కు ఇది సీక్వెల్. ఆ సిరీస్ లోనే ఆదిత్య పాత్ర పెద్దయ్యాక లండన్ వెళ్తే ఏం జరిగింది అనే కథాంశంతో ఎపిక్ సినిమా చేశాను అని తెలిపారు. ఇందులో కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి, కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాము అని తెలిపారు.
ఎపిక్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఎపిక్ కథకు కొనసాగింపు ఉంటుంది. అందుకే ఫస్ట్ సెమిస్టరు అని పెట్టాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ‘ఎపిక్- ఫైనల్ సెమిస్టర్’ అని తీస్తాను. ఈ సినిమా ముగింపు కొత్తగా ఉంటుంది. హీరోగా ఆనంద్ ను నేనే ఎంపిక చేశాను. హీరోయిన్ గా వైష్ణవిని నాగవంశీ సజెస్ట్ చేసారు. బేబీ కాంబో కమర్షియల్ గా హెల్ప్ అవుతుందని అన్నారు. సినిమాపై వచ్చిన హైప్ చూశాక ఆయన చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది. ఒక అబ్బాయి హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడి లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటాడు. చివరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా అనేది కథ. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు. కొత్తగా ఉంటుంది అనిపించి ఈ కథని రాసుకున్నాను అని తెలిపారు.
Also Read : Youtuber Nandana : యూట్యూబర్ ‘నందన’ అరెస్ట్.. విదేశాల నుంచి రాగానే అదుపులోకి..
