YouTuber Nandana : యూట్యూబర్ ‘నందన’ అరెస్ట్.. విదేశాల నుంచి రాగానే అదుపులోకి..
YouTuber Nandana Arrest: పోలీసులు యూట్యూబర్ నందన, మధుకర్ (Nandu's World) పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Nandus World Youtuber Nandana Arrest By RGIA Police
YouTuber Nandana Arrest : యూట్యూబ్, సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్, మధుకర్ కపుల్ అనే ఛానల్స్ ద్వారా లండన్ లో ఉంటూ రీల్స్, వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు నందన, మధుకర్. ఆ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకున్నారు. అయితే లండన్ లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని పలువురు విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి స్పందించకుండా మోసం చేసారని కొన్ని నెలల క్రితం వీరిపై పలువురు కంప్లైంట్ చేసారు. ఒక్కొక్కరి దగ్గర్నుంచి దాదాపు 15 నుంచి 25 లక్షలు వసూలు చేసారని, మొత్తం 20 కోట్లు వసూలు చేసి మోసం చేసారని వార్తలు వచ్చాయి.
మోసపోయిన బాధితుల్లో తెలుగు విద్యార్థులే కాక గుజరాత్, కర్ణాటక, వేరే రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నట్టు సమచారం. పలువురు బాధితులు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు నందన, మధుకర్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Also See – Aparna Das : ఖరీదైన కారు కొన్న హీరోయిన్.. కొత్తకారు పక్కన భర్తతో కలిసి ఫొటోలు..
తాజాగా నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి తాజాగా ఇండియాకు రాగా నందనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్టు తెలుస్తుంది.
