Multiple PF Accounts : ఉద్యోగాలు మారారా? మీ పేరుతో ఎన్ని PF ఖాతాలు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేయండి
Multiple PF Accounts : ఉద్యోగాలు మారినప్పుడు ఏర్పడే మల్టీ PF ఖాతాలను ఎలా గుర్తించాలి? పాత EPF బ్యాలెన్స్‌ను ప్రస్తుత ఖాతాకు ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలి? UAN, సర్వీసు హిస్టరీ, ఓటీపీ వెరిఫికేషన్ వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
multiple PF accounts
- మల్టీ PF ఖాతాలు ఎందుకు ఉంటాయి?
- జాబ్ మారిన ప్రతిసారి కొత్త ఉద్యోగంలో పీఎఫ్ ఖాతా
- UAN అకౌంటుకు అన్ని పీఎఫ్ ఖాతాలు లింక్ అయ్యాయా?
- మీ పేరుతో ఎన్ని పీఎఫ్ ఖాతాలు ఉన్నాయో చెక్ చేశారా?
Multiple PF Accounts : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఉద్యోగం మానేశారా? మరో కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారా? అయితే, ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త కంపెనీలో పీఎఫ్ ఖాతాను ఓపెన్ చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో మీ పీఎఫ్ ఖాతాల విషయంలో మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారే క్రమంలో పాత పీఎఫ్ ఖాతాను అలానే వదిలేయొద్దు.. ఒకవేళ పాత పీఎఫ్ ఖాతాను కొత్త దానికి ట్రాన్స్ ఫర్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మీకు ఒకటి కన్నా ఎక్కువ పీఎఫ్ మెంబర్ ఐడీలు లేదా UAN సంబంధించిన ఖాతాలు ఎక్కువ ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. లేదంటే, రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బులను తీసుకోవడం కష్టంగా మారుతుంది.
Read Also : Telangana High Court : అసెంబ్లీ వద్ద రచ్చ.. పోలీసుల ఓవరాక్షన్‌పై హైకోర్టు ఆగ్రహం.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఈపీఎఫ్ సభ్యుడికి 12 అంకెల యూఎఎన్ కేటాయిస్తారు. ఈ నెంబర్ ద్వారా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన పీఎఫ్ మెంబర్ ఐడీలను ఒకే ఖాతాతో లింక్ చేయొచ్చు. సాధారణంగా ఉద్యోగి ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త UAN తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత UANనే కొత్త సంస్థకు అందిస్తే పీఎఫ్ సర్వీసు రికార్డును అందులోనే కొనసాగించవచ్చు.
మల్టీ పీఎఫ్ అకౌంట్లను ఎలా గుర్తించాలి? :
- UAN చెక్ చేయండి : ప్రస్తుత ఉద్యోగంలోనూ ఇదే UAN వాడుతున్నారా? చెక్ చేయండి.
- ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి : UAN, పాస్‌వర్డ్‌తో సభ్యుల పోర్టల్‌లో సైన్ ఇన్ చేయండి.
- సర్వీసు హిస్టరీ చూడండి : View – Service Historyలోకి వెళ్లండి.
- మెంబర్ ఐడీలను పరిశీలించండి : గత, ప్రస్తుత సంస్థలకు సంబంధించిన పీఎఫ్ మెంబర్ ఐడీలను చెక్ చేయండి.
- పాత పీఎఫ్ ఖాతాలను గుర్తించండి : గత ఉద్యోగాల నుంచి ట్రాన్స్ఫర్ కానీ పీఎఫ్ డబ్బులున్న ఖాతాలను గుర్తించండి.
- ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేయండి : Online Services – One Member – One EPF Account (Transfer Request)ను ఎంచుకోండి.
- పాత ఖాతా వివరాలు : అవసరాన్ని బట్టి పాత మెంబర్ ఐడీ లేదా UANను ఎంటర్ చేయండి.
- ఖాతాను ఎంచుకోండి : ప్రస్తుత PF ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన పాత ఖాతాను సెలెక్ట్ చేయండి.
- OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి : రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మీ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి.
- స్టేటస్‌ను ట్రాక్ చేయండి : ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ద్వారా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చెక్ చేయండి.
పీఎఫ్ డబ్బులకు ఎంత సమయం? :
పాత పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కోసం వెరిఫికేషన్, అప్రూవల్ ప్రాసెస్ బట్టి సాధారణంగా 10 నుంచి 15 వర్కింగ్ డేస్ సమయం పట్టవచ్చు. ఉద్యోగాలు తరచుగా మారే వారు తమ సర్వీసు హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్ చేయడం ద్వారా పాత పీఎఫ్ ఖాతాలు, అందులోని డబ్బులు, తమ కరెంట్ ఖాతాతో సరిగ్గా లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో పీఎఫ్ సేవింగ్స్ మరింత ఈజీ అవుతుంది.
