Infinix Hot 70 Pro 5G : ఇది కదా ఆఫర్.. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Infinix Hot 70 Pro 5G : ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్ ఉంది. బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC). ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్, బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. పూర్తి ఆఫర్ల వివరాలివే..
Infinix Hot 70 Pro 5G
- ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ప్లస్ సేల్ మొదలైంది
- బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్ ఉంది
- మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G చిప్సెట్
Infinix Hot 70 Pro 5G : కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ కంపెనీ సెప్టెంబర్ 4న లాంచ్ చేసింది. కంపెనీ ప్రకారం.. బ్యాక్ సైడ్ ఇంటరాక్టివ్ AMC డిజైన్‌తో దేశంలోనే ఫస్ట్ ఫోన్..
ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్తో వస్తుంది. అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఫోన్లో 50MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్, భారీ 6000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ సేల్, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ప్లస్ సేల్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు (Infinix Hot 70 Pro 5G) అందుబాటులోకి వచ్చింది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. కానీ, సేల్ సమయంలో, ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను రూ. 2వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. రూ. 1,999 విలువైన ఫ్రీ యాక్సెసరీ వోచర్‌తో సహా అనేక ఇతర ఆఫర్లు ఉన్నాయి.
Read Also : Vivo Y400 5G : రూ.60వేల వివో 5G ఫోన్ జస్ట్ రూ.30వేల కన్నా తక్కువకే.. ఈ చీపెస్ట్ డీల్ మీకోసమే..!
ఇన్ఫినిక్స్ కస్టమర్లు రూ. 3,999 విలువైన ఇన్ఫినిక్స్ X20 బ్లూటూత్ స్పీకర్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో పొందవచ్చు. కంపెనీ అధికారిక వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సిల్క్ గ్లో పర్పుల్, డైవ్ బ్లూ, థర్మో ఆరెంజ్ మిరాజ్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ప్లస్ ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.76-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 910 నిట్స్ వరకు HBM బ్రైట్‌నెస్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC)తో వస్తుంది. ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్, బ్యాటరీ, కెమెరా, వీడియో, కౌంట్‌డౌన్ వెదర్ అలర్ట్స్ కోసం విజువల్ ఎఫెక్ట్ అందిస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G చిప్సెట్తో రన్ అవుతుంది. మాలి-G57 జీపీయూ కూడా ఉంది. కంపెనీ 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై రన్ అవుతుంది. కంపెనీ 3 మెయిన్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లను 5 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తోంది.
ఈ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంది. ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166.85 మిమీ x 79.54 మిమీ x 7.85 మిమీ, బరువు 204 గ్రాములు ఉంటుంది.
