iQOO Z11xa 5G : బ్యాటరీ అయిపోదు.. కెమెరా క్వాలిటీ తగ్గదు! 7200mAh బ్యాటరీతో ఐక్యూ 5G ఫోన్..!
iQOO Z11xa 5G : ఐక్యూ Z11xa 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో సోనీ IMX852 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది.
iQOO Z11xa 5G
- ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో 4K వీడియో రికార్డ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో 5G సెటప్
- భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
iQOO Z11xa 5G : ఐక్యూ అభిమానులకు గుడ్ న్యూస్.. కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ Z11xa 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే హై-రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది.
ప్రాసెసింగ్ పవర్ కోసం 8GB ర్యామ్, డైమెన్సిటీ 7400-టర్బో 5జీ ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్లో భారీ బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ ఐక్యూ Z11xa 5జీ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర ఎంతంటే. :
ఈ ఐక్యూ 5జీ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,499కు లభిస్తుంది. ఈ ఫోన్ టైటాన్ బ్లాక్ ప్రిస్మాటిక్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సేల్ తేదీ ఎప్పుడంటే? :
ఈ 5జీ ఫోన్ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా లభించనుంది. ఈ ఐక్యూ ఫోన్ అమెజాన్ స్పెషల్‌గా లభిస్తోంది.
ఐక్యూ జెడ్11ఎక్స్ఎ 5జీ ఫీచర్లు :
ఐక్యూ జెడ్11ఎక్స్ఎ 5జీ ఫోన్లో 2344 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.76-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో 5జీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6తో వస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. :
ఐక్యూ జెడ్11ఎక్స్ఎ 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్లో సోనీ IMX852 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె సెన్సార్ ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్ ఫ్రంట్ రియర్ కెమెరాలు, రెండింటితోనూ 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఐక్యూ జెడ్11ఎక్స్ఎ 5జీ ఫోన్ 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7200mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల వరకు టాక్ టైమ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. :
1600 ఛార్జింగ్ తర్వాత కూడా ఈ ఫోన్ బ్యాటరీ 80శాతం వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. గరిష్టంగా 6 ఏళ్ల వరకు బ్యాటరీ లైఫ్ అందించగలదు. ఈ ఫోన్లోని ఇతర ఫీచర్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.4, USB టైప్-సి వంటి కనెక్టివిటీ ఆప్షన్లకు సపోర్ట్ అందిస్తుంది.
సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సేఫ్టీ పరంగా ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఐక్యూ జెడ్11, ఐక్యూ జెడ్11ఎక్స్, ఐక్యూ జెడ్11 లైట్ వంటి ఇతర ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
