Vivo X100 Pro Price : రూ.89,999 ఫోన్ ఇప్పుడు రూ.59,999కే.. వివో X100 ప్రోపై భారీ ఆఫర్!
Vivo X100 Pro Price : వివో X100 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30వేలు డిస్కౌంట్ లభిస్తోంది. డైమన్షిటీ 9300 చిప్, ZEISS కెమెరాలు, 100W ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ అద్భుతంగా ఉంది.. పూర్తి వివరాలివే..

Vivo X100 Pro Price : వివో లవర్స్ మీకోసమే.. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో X100 ప్రోపై అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం ఈ సరికొత్త ఆఫర్ అద్భుతంగా ఉంది. కెమెరా, పర్ఫార్మెన్స్ ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.59,999కే లభ్యమవుతోంది.

భారత మార్కెట్లో రూ.89,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్‌పై నేరుగా రూ.30వేలు తగ్గింపు లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది.

అప్పుడే డీల్ పూర్తి అయినట్టు కాదు.. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్ కార్ట్ ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.56,999కి తగ్గుతుంది. ఒకేసారి మొత్తం చెల్లించలేని వారికి 36 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. నెలకు రూ.2,109 నుంచి ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది.

పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా ఉంది. పాత డివైజ్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి గరిష్ఠంగా రూ.44,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే.. వివో X100 ప్రోలో మీడియాటెక్ డైమన్సిటీ 9300 ప్రాసెసర్, 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. 5,400mAh బ్యాటరీకి 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ అందిస్తుంది. 6.78-అంగుళాల ఎల్టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.

అయితే, ఈ ఫోన్లో మెయిన్ అట్రాక్షన్ కెమెరాలే. బ్యాక్ ZEISS-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో OISతో 50MP సోనీ IMX989 మెయిన్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్, OISతో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS14తో వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ తగ్గింపు ధరలో కెమెరా, పర్ఫార్మెన్స్ రెండింటినీ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్. అయితే, కొనే ముందు ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేయడం బెటర్.
