Suyodhana : ప్రియదర్శి కొత్త సినిమా.. ‘సుయోధన’ రిలీజ్ ఎప్పుడంటే..
టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Suyodhana)
Suyodhana
Suyodhana : ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా సాయికుమార్, ప్రేమ కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సుయోధన’. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై బోసుబాబు నిడుమోలు నిర్మాణంలో వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. ఇటీవలే కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన ప్రియదర్శి ఇప్పుడు ఈ సుయోధన సినిమాతో రాబోతున్నాడు. నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సుయోధన సినిమా మార్చి 27న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Trisha : విజయ్ ఎలాంటోడో గతంలోనే చెప్పిన త్రిష.. ఏం చెప్పిందో తెలుసా?
ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. మంచి కథతో ఈ సినిమాని నిర్మించాము. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా మార్చ్ 27 శ్రీరామనవమి కానుకగా రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేస్తాము అని తెలిపారు.

