Trisha : విజయ్ ఎలాంటోడో గతంలోనే చెప్పిన త్రిష.. ఏం చెప్పిందో తెలుసా?
ఈ క్రమంలో విజయ్, త్రిషకు సంబంధించిన వార్తలు తమిళనాట వైరల్ అవుతున్నాయి.(Trisha)
Trisha
- వైరల్ గా విజయ్ విడాకుల కేసు
- తమిళనాట చర్చగా విజయ్ – త్రిష బంధం
- త్రిష గతంలో విజయ్ పై చేసిన కామెంట్స్
Trisha : ప్రస్తుతం తమిళనాట విజయ్ విడాకుల విషయం సంచలనంగా మారింది. ఇదే సమయంలో విజయ్ – త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గతంలోనే కొన్నేళ్ల క్రితం ఈ వార్తలు వచ్చినా ఇప్పుడు విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేయడంతో మరోసారి త్రిష – విజయ్ వైరల్ అవుతున్నారు. రీసెంట్ ఆ వీరిద్దరూ కలిసి ఓ పెళ్ళికి హాజరవడంతో వీరి బంధంపై మరింత చర్చ జరుగుతుంది.
ఈ క్రమంలో విజయ్, త్రిషకు సంబంధించిన వార్తలు తమిళనాట వైరల్ అవుతున్నాయి. విజయ్ – త్రిష కలిసి మొదటి సారి ఘిల్లి సినిమాలో నటించారు. ఇది మహేష్ ఒక్కడు సినిమాకు రీమేక్ గా తెరకెక్కి అక్కడ కూడా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి తిరుప్పాచ్చి, ఆతి, కొరివి, లియో సినిమాల్లో నటించారు. ఇటీవల వచ్చిన విజయ్ Goat సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
Also Read : Alekhya Tarakaratna : అప్పట్లో తారక్ ని వద్దన్నాను.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీపై అలేఖ్య కామెంట్స్..
గతంలో త్రిష ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడుతూ.. విజయ్ అద్భుతమైన వ్యక్తి. అతనితో కలిసి కొన్ని సినిమాలు చేశాను. విజయ్ చాలా సైలెంట్ గా ఉంటాడని తెలిసిందే. ఘిల్లి సినిమా మొదలయినప్పుడు అలాగే ఉండేవాడు. సెట్స్ కి వచ్చి పని చేసుకొని వెళ్లిపోయేవాడు. ఘిల్లి టీమ్ వల్ల మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. విజయ్ నాకు స్పెషల్ కో స్టార్. అతనితో చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. అతని కోపం నేనెప్పుడూ చూడలేదు. చాలా కూల్ గా ఉంటాడు. సెట్ లో ప్రొఫెషనల్ గా ఉండేవాడు. నాకు సపోర్ట్ ఉండేవాళ్ళలో తను కూడా ఒకరు అని తెలిపింది.
విజయ్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట వైరల్ గా మారాయి. విజయ్ ఈ వార్తలపై ఇండైరెక్ట్ గా స్పందిస్తూ.. నా సమస్యలు నేను చూసుకుంటాను అని కామెంట్స్ చేసారు. త్రిష మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
Also Read : Sushmita Konidela birthday: మెగా డాటర్ సుస్మిత బర్త్ డే.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి
