Sehwag : గెలిచినా, ఓడినా రూ.400 కోట్ల లాభం.. చాల‌దా? ఓన‌ర్లు అయితే జ‌ట్టులో వేలు పెట్టాలా? : సెహ్వాగ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శలు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే.

Sehwag : గెలిచినా, ఓడినా రూ.400 కోట్ల లాభం.. చాల‌దా? ఓన‌ర్లు అయితే జ‌ట్టులో వేలు పెట్టాలా? : సెహ్వాగ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Sehwag Unfiltered Take On Rahul-Sanjiv Goenka Saga

Virender Sehwag : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ల‌క్నో నిర్దేశించిన 166 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 9.4 ఓవ‌ర్ల‌లోనే వికెట్ కోల్పోకుండా ఎస్ఆర్‌హెచ్ ఛేదించింది. దీంతో మ్యాచ్ అనంత‌రం ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శలు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దీనిపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో స్పందించాడు. జ‌ట్టును ఆట‌గాళ్లు, కోచ్‌లే ముందుకు న‌డిపిస్తార‌ని, య‌జ‌మానుల జోక్యం అన‌వ‌స‌రం అంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లోనో లేదంటే ప్రెస్‌ మీట్ స‌మ‌యంలో మాత్ర‌మే ఆట‌గాళ్ల‌ను ఓన‌ర్లు క‌లిసి మాట్లాడాలి. వారి మాట‌లు ప్లేయ‌ర్ల‌లో స్పూర్తిని నింపేలా ఉండాలి అంతేగానీ.. స‌మ‌స్య ఏమిటి? ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాలు అడ‌గ‌వ‌ద్ద‌న్నాడు. ఇక వీరంతా వ్యాపార‌వేత్త‌లు అని, వీరికి లాభ‌న‌ష్టాలు మాత్ర‌మే అర్థ‌మ‌వుతాయ‌న్నాడు. కాగా.. ఇక్క‌డ వారికి ఎలాంటి న‌ష్టాలు రావ‌డం లేద‌ని, దాదాపు రూ.400కోట్ల లాభాల‌ను పొందుతున్న‌ట్లు సెహ్వాగ్ చెప్పాడు.

RCB vs DC : హ‌మ్మ‌య్యా గెలిచాం.. దండాలు సామీ..: అనుష్క శ‌ర్మ రియాక్ష‌న్ వైర‌ల్‌

జ‌ట్టును కోచ్‌లు, కెప్టెన్ న‌డిపిస్తార‌ని, కాబ‌ట్టి ప్లేయ‌ర్ల విష‌యంలో ఓన‌ర్ల జోక్యం ఉండొద్ద‌ని సూచించాడు. ఇక్క‌డ వారికి ఎలాంటి న‌ష్టాలు రాన‌ప్పుడు జ‌ట్టులో ఏం జ‌రిగినా ప‌ట్టించుకునే అవ‌స‌రం లేద‌ని తాను అనుకుంటున్న‌ట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఐపీఎల్‌లో చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయ‌న్నాడు. ఓ ఆట‌గాడిని ఒక ఫ్రాంచైజీ వ‌దిలి వ‌స్తే మ‌రో ఫ్రాంచైజీ తీసుకుంటుంద‌ని చెప్పాడు.

అలా ఓ కీల‌క ఆట‌గాడు దూరం అయితే విజ‌యాల శాతం సున్నా అవుతుంద‌న్నాడు. తాను పంజాబ్ జ‌ట్టును వీడిన‌ప్పుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నార‌ని, ఆ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌నీసం ఐదో స్థానంతో వారు సీజ‌న్‌ను ముగించ‌లేక‌పోయిన‌ట్లు సెహ్వాగ్ చెప్పాడు.

MS Dhoni : చిన్న త‌లాను మైదానంలో చూడ‌గానే ఎంఎస్ ధోని ఏం చేశాడంటే?