RCB vs DC : హమ్మయ్యా గెలిచాం.. దండాలు సామీ..: అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.

screengrab from video posted on x by@IPL
RCB vs DC – Anushka Sharma : ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఫస్టాప్‌లో వరుస ఓటములతో డీలా పడ్డ బెంగళూరు సెకండాఫ్‌లో దుమ్ములేపుతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలో మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం చిన్నస్వామి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ ఐదో స్థానానికి దూసుకువచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలవడంతో ఆర్‌సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది.
IRE vs PAK : అభిమానితో గొడవ పడ్డ పాకిస్తాన్ స్టార్ పేసర్.. లాక్కెళ్లిన సెక్యూరిటీ
ఆర్‌సీబీ గెలవగానే బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హమ్మయ్యా గెలిచాం రా బాబు.. దేవుడికి దండాలు అనే రియాక్షన్‌ను ఇచ్చింది. అటు కోహ్లి సైతం తనదైన శైలిలో మజిల్స్ చూపించాడు.
ఢిల్లీతో మ్యాచ్ కలిపి ఆర్‌సీబీ ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడింది. 6 మ్యాచుల్లో గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. తన చివరి మ్యాచ్ ను మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.
MS Dhoni : చిన్న తలాను మైదానంలో చూడగానే ఎంఎస్ ధోని ఏం చేశాడంటే?
Wrapped up in style ⚡️
High fives ? all around as #RCB make it FIVE ?️ in a row ?
A comfortable 4️⃣7️⃣-run win at home ?
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE
— IndianPremierLeague (@IPL) May 12, 2024