Kavya Kalyanram : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..?
తాజాగా కావ్య పెళ్లి గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. (Kavya Kalyanram)
Kavya Kalyanram
Kavya Kalyanram : చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. మసూద, బలగం, ఉస్తాద్.. సినిమాలతో హీరోయిన్ గా మెప్పించింది. త్వరలో మరిన్ని సినిమాలతో రాబోతుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది కావ్య.
తాజాగా కావ్య పెళ్లి గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. కావ్య కళ్యాణ్ రామ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ప్రేమలో ఉందని సమాచారం. కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ. సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన కాల భైరవ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా దూసుకుపోతున్నాడు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి విజయాలే సాధించాడు కాలభైరవ.
Also Read : Adivi Sesh : నాగచైతన్య పెళ్లిని అడివి శేష్ భలే వాడుకున్నాడే.. మంచి పనే చేసాడు..
గత కొన్నేళ్లుగా కాల భైరవ – కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమని ఒప్పుకున్నారని, ఈ సంవత్సరమే పెళ్లి కూడా చేసుకుంటారని వినిపిస్తుంది. ఆల్రెడీ కీరవాణి చిన్న కొడుకు సింహ కోడూరి నటుడు మురళి మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్లి కూడా జరగబోతుందని తెలుస్తుంది. అయితే దీనిపై కావ్య, భైరవ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

