IRE vs PAK : అభిమానితో గొడవ పడ్డ పాకిస్తాన్ స్టార్ పేసర్.. లాక్కెళ్లిన సెక్యూరిటీ
తొలి టీ20లో పసికూన ఐర్లాండ్ చేతిలో భంగపడ్డ పాకిస్తాన్ ఆదివారం జరిగిన రెండో టి20లో గెలిచింది.

Shaheen Afridi fight with fan during IRE vs PAK 2nd T20I
Ireland vs Pakistan : పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. తొలి టీ20లో పసికూన ఐర్లాండ్ చేతిలో భంగపడ్డ పాకిస్తాన్ ఆదివారం జరిగిన రెండో టి20లో గెలిచింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తరువాత పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ ఫ్యాన్‌తో గొడవ పడ్డాడు. ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లతో రాణించాడు. ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 75 నాటౌట్), ఫఖార్ జమాన్ (40 బంతుల్లో 78) అర్ధశతకాలు బాదగా ఆఖర్లో ఆజామ్ ఖాన్ (10 బంతుల్లో 30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
MS Dhoni : చిన్న తలాను మైదానంలో చూడగానే ఎంఎస్ ధోని ఏం చేశాడంటే?
ఈ మ్యాచ్ గెలిచిన తరువాత షాహిన్ అఫ్రిది మ్యాచ్‌కు హాజరైన అభిమానుల్లో కొందరికి ఆటోగ్రాఫ్‌లతో పాటు సెల్ఫీలు ఇచ్చాడు. ఈ సమయంలో ఓ అభిమాని షాహిన్‌ను ఏదో అన్నాడు. దీంతో అఫ్రిది ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరూ వాదించుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో అతడిని బయటకు తీసుకువెళ్లాలంటూ సూచించాడు. వారిద్దరు ఎందుకు, ఏ విషయం పై అలా గొడవ పడ్డారో తెలియరాలేదు. కాగా.. వీడియో వైరల్‌గా మారింది.
కాగా.. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజాం డకౌట్ అయ్యాడు.
RCB : బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై పై ఎంత తేడాతో గెలవాలంటే..?
Very Sad to see an Afghani Spectator misbehaving with ?#ShaheenAfridi I #PAKvIRE pic.twitter.com/djdKjxKPT4
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) May 13, 2024