Chaitu Jonnalagadda: కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చైతన్య జొన్నలగడ్డ.. ఏకంగా ధనుష్ 55లో క్రేజీ రోల్
ధనుష్ 55వ సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకున్న చైతన్య జొన్నలగడ్డ(Chaitu Jonnalagadda).
Chaitu Jonnalagadda doing a key role in dhanush 55 movie
- చైతన్య జొన్నలగడ్డకు బంపర్ ఆఫర్
- ధనుష్ సినిమాలో కీ రోల్
- త్వరలోనే అధికారిక ప్రకటన
Chaitu Jonnalagadda: టాలీవుడ్ యాక్టర్ చైతన్య జొన్నలగడ్డ తన కెరీర్లో మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన సహజ సిద్ధమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చైతన్య. ఈ సినిమాకు గాను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ రోకా ఈవెంట్ లో టాలీవుడ్ సెలబ్రెటీస్.. ఫొటోలు
తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 55వ చిత్రం (#D55)లో చైతన్య(Chaitu Jonnalagadda) ఒక కీలకమైన, పవర్ ఫుల్ పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఎదో చిన్న రోల్ కాదు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్. ఒక తెలుగు నటుడికి తమిళ స్టార్ హీరో సినిమాలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కెరీర్ స్టార్టింగ్ లో చైతన్య, తనదైన కామెడీ, ఎమోషనల్ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఆయనలోని మాస్, క్లాస్ యాంగిల్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్ ఉన్న ధనుష్ ప్రాజెక్టులో అవకాశం రావడం నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. చాలా మంది నటులు ధనుష్ లాంటి యాక్టర్ తో నటించాలని కలగా ఉంటుంది. కానీ, చైతన్యకు ఈ అవకాశం ఇంత త్వరగా రావడం అంటే మాములు విషయం కాదు. కాబట్టి, ఈ సినిమా తరువాత కూడా చైతన్యకు మంచి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం ధనుష్ 55వ సినిమా షూటింగ్ దశలో ఉంది.
