HDFC MCLR Rates : HDFC రుణగ్రహీతలకు బిగ్ రిలీఫ్.. రుణ వడ్డీ రేట్లు తగ్గింపు.. భారీగా తగ్గనున్న హోం లోన్ EMIలు
HDFC MCLR Rates : హెచ్డీఎఫ్సీ కస్టమర్ల కోసం గృహ రుణ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో హోం లోన్ల ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. బ్యాంక్ పరిమిత కాలానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను తగ్గించింది.
HDFC MCLR Rates
- హెచ్డీఎఫ్సీ రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్
- 10 బేసిస్ పాయింట్ల వరకు రుణ వడ్డీ రేట్లు తగ్గింపు
- మార్చి 7 నుంచి కొత్త MCLR రేట్లు అమల్లోకి
- గృహ, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గే అవకాశం
HDFC MCLR Rates : హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. లక్షలాది మంది కస్టమర్లకు భారీ గిఫ్ట్ అందిస్తోంది. HDFC బ్యాంక్ గృహ రుణ రేట్లను భారీగా తగ్గించింది. భవిష్యత్తులో మీ గృహ రుణ ఈఎంఐ తగ్గనుంది. ఈ బ్యాంక్ కొన్ని కాల వ్యవధులకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను తగ్గించింది.
ఎంపిక చేసిన కాలవ్యవధులపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు (0.10శాతం) వరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు మార్చి 7, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. గతంలో 8.25శాతం, 8.60శాతంతో పోలిస్తే ఇప్పుడు బ్యాంక్ MCLR రేట్లు 8.15శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉన్నాయి.
కొత్త MCLR రేట్లు ఇవే :
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. రాత్రిపూట, ఒక నెల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.15శాతంగా ఉంటుంది. 3-నెలల కాలానికి 8.25శాతం తగ్గుతుంది. 6-నెలలు, ఒక ఏడాది కాలాలకు ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి తగ్గుతుంది. అంతేకాదు.. 2 ఏళ్లకు 8.45శాతం రేటు, 3 ఏళ్లకు 8.55శాతం వర్తిస్తుంది.
రుణగ్రహీతలపై ఎలాంటి ప్రభావం? :
ఈ తగ్గింపు గృహ రుణాలు, ఆటో రుణాలు, పర్సనల్ లోన్లు MCLRతో లింక్ అయి కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. రేటు తగ్గింపు అనేది లోన్లపై ఈఎంఐ కొద్దిగా తగ్గుతుంది. అయితే, ఈ ప్రయోజనం వెంటనే అందుబాటులో ఉండదు. రుణం వడ్డీ రీసెట్ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
ఏ కస్టమర్లకు ఎఫెక్ట్ ఉండదు? :
ఆర్బీఐ రెపో రేటు వంటి ఎక్స్ ట్రనల్ బెంచ్‌మార్క్‌తో లింక్ అయిన లోన్లు ఉన్న రుణగ్రహీతలు ఈ ఎంసీఎల్ఆర్ మార్పుతో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వారి EMIలు రెపో రేటులోని మార్పుల ఆధారంగా నిర్ణయిస్తారు.
అసలు ఎంసీఎల్ఆర్ ఏంటి? :
బ్యాంకులు ఎక్కువ రుణాలను అందించే కనీస వడ్డీ రేటు ఎంసీఎల్ఆర్ పాలసీ రేటు మార్పుల ప్రయోజనాలు త్వరగా కస్టమర్లకు చేరేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016లో అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త రుణాలు ఇప్పుడు రెపో రేటు వంటి బెంచ్‌మార్క్‌లకు ఇంటిగ్రేట్ అయినా అనేక పాత గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇప్పటికీ MCLR ఆధారంగా నిర్ణయిస్తుంది. అందుకే MCLRలో మార్పు కూడా పాత రుణగ్రహీతలపై కూడా ప్రభావం ఉండొచ్చు.
