Vivo X200 Pro : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో X200 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంత తగ్గిందో తెలుసా?
Vivo X200 Pro : వివో ఫోన్ కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్.. వివో X200 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 15వేల కన్నా తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
Vivo X200 Pro
- అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ ప్రారంభం
- వైడ్ రేంజ్ యూజర్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు
- వివో X200 ప్రోపై రూ.15వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్
- కెమెరా పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆకట్టుకునే డిస్ప్లే
Vivo X200 Pro : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా ఈ వివో ప్రో కొనుగోలుపై కిర్రాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎయిర్ కండిషనర్లు, కెమెరాలు సహా వైడ్ రేంజ్ యూజర్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
వివో ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్‌లో భాగంగా వివో X200 ప్రో రూ. 15వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆకట్టుకునే డిస్ప్లే, ప్రీమియం ఇన్-హ్యాండ్ ఫీల్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అమెజాన్ డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో X200 ప్రో అమెజాన్ డీల్ :
వివో X200 ప్రో (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్) భారత మార్కెట్లో రూ.94,999కు లాంచ్ అయింది. ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ సందర్భంగా అమెజాన్ వివో X200 ప్రోపై రూ.12,099 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
దాంతో ఈ వివో ఫోన్ ధర రూ.82,900కు తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేలు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ పై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
వివో X200 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో X200 ప్రో, మీడియాటెక్ డైమన్షిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB LPDDR5X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. ఇంకా, ఈ వివో ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని అందిస్తుంది.
ఫ్రంట్ సైడ్ 6.78-అంగుళాల 1.5K 120Hz అమోల్డ్ డిస్ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో X200 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో వస్తుంది.
