Gold Rate Today : గోల్డ్ మార్కెట్లో భారీ ట్విస్ట్.. బంగారం ధరల్లో భారీగా మార్పులు.. ఏపీ, తెలంగాణలో గోల్డ్ ఎంత పెరిగిందంటే?
Gold and Silver Rates Today, March 11: బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి మాత్రం రూ. 3 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంత ఉందంటే?

Gold and Silver Rates Today, March 11: బాబోయ్ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గోల్డ్ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకూ తగ్గుతూ వచ్చిన బంగారం కాస్త రెండు రోజులుగా పెరుగుతూనే ఉంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కదా బంగారం కొందామని చూస్తున్నవారికి షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే వెండి కూడా రూ. 3 లక్షలకు చేరింది. బంగారం కూడా రూ. 2 లక్షల దిశగా దూసుకుపోతోంది.

ఒకవైపు ఇరాన్, ఇజ్రెయెల్, అమెరికాతో యుద్ధం వేళ అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. స్టాక్ మార్కెట్, ముడి చమురు ధరలు, బులియన్ మార్కెట్‌పై కూడా ప్రభావం పడింది.

గోల్డ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు బంగారం జోలికి పోయే పరిస్థితి కనిపించడం లేదు. బంగారం తగ్గాక కొందాంలే అని అనుకుంటున్నారు. నిన్నటి ధరలతో పోలిస్తే మార్చి 11న బుధవారం రోజున బంగారం ధరలు కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.

దేశయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.93 పెరిగింది. ఆపై రూ.16,331 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.85 పెరిగి ఆపై రూ.14,970 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర కూడా రూ.69 పెరిగింది. దాంతో రూ.12,248 వద్ద కొనసాగుతోంది.

100 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధరలు 9,300 పెరిగాయి. ఫలితంగా రూ.16,33,100 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల గోల్డ్ ధర 100 గ్రాములుకు రూ.8,500 పెరిగింది. ఆపై రూ. 14,97,000 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములుకు రూ.6,900 పెరిగి ఆపై రూ.12,24,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలివే : ఏపీ, తెలంగాణలో కూడా బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.930 పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర రూ.1,63,310 దగ్గర కొనసాగుతోంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ.850 పెరిగి ఆపై రూ.1,49,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారట్ల పసిడి ధర కూడా రూ.690 పెరిగింది. ఆపై రూ.1,22,480 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 24 క్యారట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.930 పెరిగింది. దాంతో ఈరోజు గోల్డ్ రూ.1,63,310 పలుకుతోంది. 22 క్యారెట్లకు గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.850 పెరిగింది. దాంతో ఈరోజు ధర రూ.1,49,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.690 పెరిగి రూ.1,22,480 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖలో కూడా 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు ఇదే విధంగా ట్రేడ్ అవుతున్నాయి.

దేశీయ ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే : చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,64,950 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,51,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,29,500 గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ.1,63,460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,49,850 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు ధర రూ.1,22,630 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.930 పెరిగింది. ఆపై రూ.1,63,310 వద్ద ధర పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.850 పెరిగి రూ.1,49,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.690 పెరిగి ఆపై రూ.1,22,480 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ. 3 లక్షల వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది.
