Monalsia : మోనాలిసా ది ప్రేమ వివాహం కాదు.. లవ్ జీహాద్.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
మోనాలిసా నిన్న కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. (Monalsia)
Monalsia
- మోనాలిసా ప్రేమ పెళ్లి
- కేరళలో పారిపోయి పెళ్లి
- ఇది లవ్ జీహాద్ అంటూ డైరెక్టర్ కామెంట్స్
Monalsia : కుంభమేళాలో పూసలు అముకుంటూ ఒక్కసారిగా వైరల్ అయింది మోనాలిసా. దాంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెని తీసుకొచ్చి హీరోయిన్ ని చేసారు కానీ సనోజ్ మిశ్రాపై పలు ఆరోపణలు చేసి జైలుకు పంపడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సనోజ్ మిశ్రా హిందీలో, తెలుగులో రెండు సినిమాలు హీరోయిన్ గా ఓకే చేసింది.
తాజాగా మోనాలిసా నిన్న కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. వాళ్ళింట్లో వాళ్లకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించింది మోనాలిసా. దీంతో మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read : Prabhas : ఒరే నాయనా.. అది ప్రభాస్ కాదురా.. ఆ ఫోటో నాదే.. నటుడు కామెంట్స్..
మోనాలిసా పెళ్లిపై బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందిస్తూ తన సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. సనోజ్ మిశ్రా దీనిపై స్పందిస్తూ.. మోనాలిసా ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై ఈ పెళ్లి చేసుకుంది. ఇది పెళ్లి కాదు, లవ్ జీహాద్ లో భాగం. మోనాలిసా జీవితాన్ని మార్చడానికి నేనే ఆమెకు శిక్షణ ఇచ్చి సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చాను కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు నన్ను బాధించాయి. ఇది తిరుగుబాటు కాదు లవ్ జిహాద్. నా జీవితంలో అత్యంత చెత్త రోజు. మోనాలిసా ఈరోజు మళ్లీ వార్తల్లో నిలిచింది. నేను మాత్రం నిరాశలో ఉన్నాను. ఇప్పటికే మోనాలిసా బాధితురాలిగా మారింది అని అన్నారు.
అలాగే.. మొనాలిసా ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఆమె తల్లిని వదిలేసి తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తను తన తల్లి కోసం బాధపడుతుంది. ఆ విషయాలు నాకు చెప్పుకొని బాధపడింది అని తెలిపాడు. అంతేకాకుండా.. నా దగ్గర పనిచేసే ఓ వ్యక్తి మోనాలిసా మేనేజర్ గా మారి ఆమెని తప్పుదోవ పట్టించాడు. సౌత్ సినిమాలలో ఆమెతో ఒప్పందాలు చేయించాడు అని అన్నారు. దీనిపై మోనాలిసా కానీ, ఆమె భర్త కానీ స్పందిస్తారేమో చూడాలి. మరోవైపు మోనాలిసా పెళ్లిని కేరళ కమ్యూనిస్టులు, అక్కడ కొన్ని వర్గాలు ఇది నిజమైన కేరళ స్టోరీ అంటూ ప్రమోట్ చేస్తున్నారు . మొత్తానికి మోనాలిసా పెళ్లి వార్తల్లో నిలిచింది.
Also Read : Hansika Motwanni : భర్త సోహైల్ తో విడాకులు.. అతని గురించి ఈ విషయం తెలుసా.. అంతకుముందే హన్సిక ఫ్రెండ్ తో..
