IPL 2026 : ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది.. ఆర్సీబీ, సన్రైజర్స్ల మధ్య తొలి మ్యాచ్
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 ) షెడ్యూల్ వచ్చేసింది.
BCCI announces schedule for first phase of TATA IPL 2026
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
- తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ
- ఆర్సీబీ, సన్రైజర్స్ల మధ్య తొలి మ్యాచ్
IPL 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో దశల వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
🚨 News 🚨
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
— IndianPremierLeague (@IPL) March 11, 2026
MS Dhoni : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఆడనున్న ధోని.. అయితే..
తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మార్చి 28న జరగనున్న ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. మార్చి 29న జరిగే ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది.
ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ షెడ్యూల్ ఇదే..
* మార్చి 28 – ఆర్సీబీ vs సన్‌రైజర్స్ (బెంగళూరు)
* మార్చి 29 – ముంబై vs కేకేఆర్ (ముంబై)
* మార్చి 30 – రాజస్థాన్ vs చెన్నై (గౌహతి)
* మార్చి 31 – పంజాబ్ vs గుజరాత్ టైటాన్స్( ముల్లన్పూర్)
* ఏప్రిల్ 1 – లక్నో vs ఢీల్లీ (లక్నో)
* ఏప్రిల్ 2 – కోల్‌కతా vs సన్‌రైజర్స్ (కోల్‌కతా)
* ఏప్రిల్ 3 – చెన్నై vs పంజాబ్ (చెన్నై)
* ఏప్రిల్ 4 – ఢిల్లీ vs ముంబై (ఢిల్లీ)
* ఏప్రిల్ 4 – గుజరాత్ vs రాజస్థాన్ ( అహ్మదాబాద్)
* ఏప్రిల్ 5 – సన్‌రైజర్స్ vs లక్నో( హైదరాబాద్)
* ఏప్రిల్ 5 – ఆర్సీబీ vs చెన్నై ( బెంగళూరు)
* ఏప్రిల్ 6 – కోల్‌కతా vs పంజాబ్ ( కోల్‌కతా)
BAN vs PAK : వన్డే క్రికెట్లో పెను సంచలనం.. తొలి వన్డేలో పాక్ పై బంగ్లాదేశ్ ఘన విజయం
* ఏప్రిల్ 7 – రాజస్థాన్ vs ముంబై ( గౌహతి)
* ఏప్రిల్ 8 – ఢిల్లీ vs గుజరాత్ (ఢిల్లీ)
* ఏప్రిల్ 9 – కోల్‌కతా vs లక్నో( కోల్‌కతా)
* ఏప్రిల్ 10 – రాజస్థాన్ vs ఆర్సీబీ (గౌహతి)
* ఏప్రిల్ 11 – పంజాబ్ vs సన్‌రైజర్స్ (ముల్లన్పూర్)
* ఏప్రిల్ 11 – చెన్నై vs ఢిల్లీ (చెన్నై)
* ఏప్రిల్ 12 – లక్నో vs గుజరాత్ (లక్నో)
* ఏప్రిల్ 12- ముంబై vs ఆర్సీబీ (ముంబై)
