MS Dhoni : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఆడనున్న ధోని.. అయితే..
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఎంఎస్ ధోని (MS Dhoni) ఆడతాడని సీఎస్కే సీఈఓ కాశి విశ్వనాథన్ తెలిపాడు.
MS Dhoni will play full IPL 2026 season Chennai Super Kings CEO Kasi Viswanathan
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపైనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని 2020లోనే వీడ్కోలు పలికాడు ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు అన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ధోని వయసు 44 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో అతడు ఆడతాడా? లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడితే అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాడా? 20 ఓవర్ల పాటు మైదానంలో ఉంటాడా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ మదిలో మెదులుతున్నాయి.
తాజాగా వీటి అన్నింటికి చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కాశి విశ్వనాథన్ సమాధానం ఇచ్చారు. ధోని అన్ని మ్యాచ్‌లు ఆడతాడని స్పష్టం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడా? లేదంటే ఫుల్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతాడా? అనే ప్రశ్న ఎదురు కాగా.. దీనిపై తాను ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నాడు.
అది క్రికెట్‌కు సంబంధించిన విషయం. టీమ్‌మేనేజ్‌మెంట్ దానిపై నిర్ణయం తీసుకుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాదు. ధోని బ్యాటర్‌గా లేదంటే కీపర్‌గా లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడా? అనేది వారే నిర్ణయిస్తారు అని చెప్పుకొచ్చాడు.
BAN vs PAK : వన్డే క్రికెట్లో పెను సంచలనం.. తొలి వన్డేలో పాక్ పై బంగ్లాదేశ్ ఘన విజయం
ఇక తమిళనాడులో మాత్రమే తాము ఆడతామని, ఎన్నికల నేపథ్యంలో ప్లేయర్ల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నాడు. తాము బీసీసీఐ షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు.
