Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో న్యూజిలాండ్ పై ఒకే ఒక్కడు..
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Rohit Sharma Creates History Most ODI sixes against New Zealand
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 23 పరుగులు సాధించాడు.
షాహిద్ అఫ్రిది 38 వన్డేల్లో న్యూజిలాండ్ పై 50 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ 36 వన్డేల్లో 51 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరిద్దరి తరువాత క్రిస్ గేల్, సనత్ జయసూర్య, జోస్ బట్లర్ లు ఉన్నారు.
న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ (భారత్) – 36 వన్డేల్లో 51 సిక్సర్లు
* షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 38 వన్డేల్లో 50 సిక్సర్లు
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 30 వన్డేల్లో 45 సిక్సర్లు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 47 వన్డేల్లో 41 సిక్సర్లు
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 28 వన్డేల్లో 29 సిక్సర్లు
వన్డేలు, అంతర్జాతీయ క్రికెట్ రెండింటిలోనూ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ 85 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) కివీస్‌పై అత్యధిక సిక్సర్ల కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉంది. ఈ గేల్ రికార్డును బద్దలు కొట్టేందుకు హిట్‌మ్యాన్‌కు మరో మూడు సిక్సర్లు అవసరం.
గేల్ కివీస్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 51 మ్యాచ్‌లు ఆడి.. 57 ఇన్నింగ్స్‌లలో 87 సిక్సర్లు బాదాడు. మరోవైపు రోహిత్ 62 మ్యాచ్‌లలో 68 ఇన్నింగ్స్‌లలో 85 సిక్సర్లు సాధించాడు.
