ICC : టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించిన ఐసీసీ.. న్యూజిలాండ్‌కు 13 కోట్లు, భారత్ కు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన జట్లు ఎంత మొత్తం గెలుచుకున్నాయి అనే విషయాన్ని ఐసీసీ (ICC) వెల్లడించింది.
ICC Reveals T20 World Cup 2026 Prize Money Distribution Details
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్
- ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించిన ఐసీసీ
- ప్రతి జట్టుకు కనీసం రెండు కోట్లు
ICC : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన తొలి టీమ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదండోయ్ అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది.
ఇక తాజాగా (బుధవారం) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏ జట్టు ఎంత మొత్తం గెలుచుకుంది అనే విషయాన్ని వెల్లడించింది. టోర్నీలో ఆడిన ప్రతి జట్టు పార్టిసిపేషన్ ఫీజు కింద 225,000 డాలర్ల కనీస మొత్తాన్ని అందుకుంటుంది. దీంతో పాటు గ్రూప్, సూపర్-8 దశ, సెమీఫైనల్, ఫైనల్ లో సాధించిన ప్రతి విజయానికి కొంత మొత్తం చొప్పున అందుకుంటాయి. టోర్నీ అనంతరం ఆయా జట్లు నిలిచిన స్థానాల ప్రకారం ఐసీసీ ప్రైజ్‌మనీని అందజేసింది. ఈ ప్రైజ్‌మనీ మొత్తాన్ని ఆటగాళ్లకు కాకుండా ఆయా దేశాల క్రికెట్ బోర్డుకు ఐసీసీ అందజేసింది.
BAN vs PAK : వన్డే క్రికెట్లో పెను సంచలనం.. తొలి వన్డేలో పాక్ పై బంగ్లాదేశ్ ఘన విజయం
విజేతగా నిలిచిన భారత్ $2,639,423 డాలర్లు (సుమారు రూ. 24.25 కోట్లు) అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ 1,422,692 డాలర్లు (సుమారు రూ. 13.08 కోట్లు) దక్కించుకుంది. సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు $1,005,577 (సుమారు రూ. 9.24 కోట్లు), ఇంగ్లాండ్‌కు $974,423 (రూ. 8.96 కోట్లు) లభించాయి. పాకిస్తాన్‌కు $522,692 (సుమారు రూ. 4.80 కోట్లు) లభించింది.
ప్రైజ్‌మనీ పంపిణీ (అమెరికా డాలర్లలో)ఇలా..
* భారతదేశం – $2,639,423
* న్యూజిలాండ్ – $1,422,692
* దక్షిణాఫ్రికా – $1,005,577
* ఇంగ్లాండ్ – $974,423
* వెస్టిండీస్ – $538,269
* పాకిస్తాన్ – $522,692
* జింబాబ్వే – $491,538
* శ్రీలంక – $475,962
* ఆఫ్గానిస్తాన్ – $309,808
* ఆస్ట్రేలియా – $309,808
* అమెరికా – $309,808
* స్కాట్లాండ్ – $278,654
* ఐర్లాండ్ – $271,731
* ఇటలీ – $256,154
* నెదర్లాండ్స్ – $256,154
* యుఏఈ – $256,154
* నేపాల్ – $256,154
* కెనడా – $225,000
* నమీబియా – $225,000
* ఒమన్ – $225,000
