Maruti Suzuki Jimny Bookings : మారుతి సుజుకి జిమ్నీ 30వేల బుకింగ్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti Suzuki Jimny bookings : మారుతి సుజుకి ఇండియాలో ఐదు డోర్లతో జిమ్నీ SUV మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. లాంచ్‌కు ముందే జిమ్నీ బుకింగ్స్ మొదల్యాయి. ఇప్పటివరకూ 30వేల బుకింగ్స్ పూర్తి చేసింది.

Maruti Suzuki Jimny bookings : ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తన పోర్ట్‌ఫోలియోకు ఐదు డోర్ల జిమ్నీ SUVని చేర్చేందుకు రెడీ అవుతోంది. ఆఫ్-రోడర్ ప్రారంభానికి ముందే మారుతి సుజుకి రాబోయే జిమ్నీ SUV మోడల్ కొనుగోలుపై 30వేల బుకింగ్‌లను పూర్తి చేసినట్టు రిపోర్టు తెలిపింది.

మారుతి సుజుకి జిమ్నీ ధర :
మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే జిమ్నీ SUV మోడల్ ధర మరో వారంలో ప్రకటించనుంది. జిమ్నీ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు.

మారుతీ సుజుకి జిమ్నీ సేల్స్ :
మారుతీ సుజుకి జిమ్నీ సేల్స్ ఆఫ్-రోడర్ కస్టమర్ డెలివరీలు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Read Also :  Maruti Suzuki Jimny : మారుతి సుజుకి జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 24,500 బుకింగ్స్ దాటేసింది.. ఈ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

మారుతీ సుజుకి జిమ్నీ బుకింగ్స్ :
జనవరి 12న ఫ్రాంక్స్‌తో పాటు జిమ్నీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రెండు SUVలను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

Maruti Suzuki Jimny bookings reach 30,000 

మారుతి SUV టార్గెట్ :
మారుతి ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో నాలుగు SUVలను కలిగి ఉంది. అందులో Fronx, Brezza, Jimny, Grand Vitara ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY24)లో SUV మార్కెట్లో 25శాతం వాటాను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం (FY23)లో SUV వాల్యూమ్‌లు 1,673,000 యూనిట్లుగా ఉండగా, FY24లో దాదాపు 1,900,000 యూనిట్లకు పెరుగుతాయని అంచనా.

మారుతి సుజుకి జిమ్నీ vs మహీంద్రా థార్ :
మారుతి జిమ్నీ జనాదరణ పొందిన థార్‌తో పోటీ పడుతోంది. థార్ ఇప్పుడు 4WD, RWDతో అందించనుంది. జిమ్నీలో, 4WD (ALLGRIP PRO) ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు. మారుతి SUVతో పాటుగా ఉంటుంది. అందులో 2WD ఉండదని గమనించాలి.

మారుతీ సుజుకి జిమ్నీ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ :
జిమ్నీ పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm) నుంచి పవర్ అందిస్తుంది. 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో రావొచ్చు. లాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా, ఆఫ్-రోడర్ ALLGRIP PRO 4WD టెక్నాలజీతో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్) స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది.

Read Also : Apple iPhone 14 Red : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌ 14పై భారీ డీల్.. తక్కువ ధరకు ఇప్పుడే కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు