Bengaluru Groom : ట్రెండ్ మారింది.. ప్రస్తుత రోజుల్లో పెళ్లివేడుకలను కొత్తగా చేసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. అందరిలా కాకుండా కాస్తా వినూత్నంగా ట్రై చేస్తున్నారు. ప్రత్యేకించి పెళ్లి బరాత్‌లో సరికొత్తగా ఉండేలా వేడుకలు జరుపుకుంటున్నారు. తాజాగా బెంగుళూరులో ఓ వ్యక్తి గుర్రాన్ని వదిలి ఏథర్ ఎలక్ట్రిక్ బైక్‌పై తన పెళ్లికి వచ్చాడు. పెళ్లి బరాత్‌లో ఎలక్ట్రిక్ వాహనం (EV) పక్కన వరుడితో పాటు కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
Read Also : Viral Video : ముంబైలో ధూళి తుఫాను.. కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
ఇంతకీ పెళ్లికొడుకు ఎవరో కాదు.. ఏథర్ ఎనర్జీతో పనిచేస్తున్న పారిశ్రామిక డిజైనర్ దర్శన్ పటేల్.. గతవారమే ఆయనకు పెళ్లి అయింది. దీనిపై పీక్ బెంగళూరు అనే స్టార్టప్ కంపెనీ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లిలో గుర్రాల స్థానంలో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నారు’ అని పోస్టు చేసింది. ఈ వైరల్ ఫోటోలో ఉన్న ఈవీ కొత్తగా లాంచ్ అయిన ఏథర్ రిజ్టా ఈవీ బైక్. ఈ ఫోటో వైరల్ కావడంతో వరుడు కూడా స్పందించాడు. ‘నా పెళ్లి బరాత్ కోసం రిజ్టా వచ్చింది’ అని పోస్టు పెట్టాడు.
Horses in weddings are being replaced by Ather in @peakbengaluru ?? pic.twitter.com/rXgqFFXtxP
— Peak Bengaluru (@peakbengaluru) May 13, 2024
ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా మాట్లాడుతూ.. వరుడు రిజ్టాలో తన బరాత్ ఎంట్రీని కోరుకుంటున్నాడని, దానికి కంపెనీ సాకారం అందించింది. గత వారంలో దర్శన్ తన బరాత్ ఎంట్రీని ఏథర్ రిజ్టాతో చేయాలనుకున్నాడు. తన గ్రాండ్ ఎంట్రన్స్ కోసం మా ఎలక్ట్రిక్ స్కూటర్ ముస్తాబైంది. ఎందుకంటే.. రిజ్టా స్కూటర్ ఫ్యామిలీకి సంబంధించినది’ అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
ఏథర్ ఎనర్జీ కూడా తన అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి ఫన్నీగా స్పందించింది. “గుర్రాలపై అందరూ తిరుగుతారు. కానీ మేం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇష్టపడతాం. ఆసక్తిగా ఉండే పెళ్లి రోజు కోసం ఏథర్‌ను రైడ్ చేయండి. ఎప్పుడూ క్లీన్‌గా ఉంచండి” అని ఈవీ మేకర్ పోస్టు చేశారు.
So this happened last weekend!
Darshan wanted to make his baraat entry on Rizta and we had to make it happen for his grand entrance.
And, why not? Rizta is all about family. pic.twitter.com/zudTju0chF
— Tarun Mehta (@tarunsmehta) May 14, 2024
వరుడు దర్శన్ పెళ్లి బరాత్ ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుడు వివాహానికి సంబంధించిన వినూత్న విధానాన్ని చూసి చాలా మంది నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఒక బెంగళూరు కుర్రాడు మాత్రమే దీన్ని చేయగలడు” అని వ్యవస్థాపకుడు జైదేవ్ వ్యాఖ్యానించారు. మరో ఇన్వెస్టర్ దీపక్ గుప్తా ‘జీరో ఎమిషన్ హార్స్’ అంటూ పేర్కొన్నారు.
ఏథర్ రిజ్టా ధర ఎంతంటే? :
అథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెలలో లాంచ్ అయింది. ఈవీ స్కూటర్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) కాగా, బుకింగ్‌లు రూ. 999 నుంచి ప్రారంభమవుతాయి. దాదాపు మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్న ఈవీ స్కూటర్ డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నాయి.