Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ .. విశేషాలు ఎన్నో

అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించటానికి ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడువు అరుదైన అగరుబత్తీ ఆకట్టుకుంటోంది. రామయ్య సన్నిధి ఈ బాహుబలి బత్తీ వెలిగేందుకు సిద్ధమైంది.

108 feet incense stick Ayodhya Rama : అయోధ్య రామయ్య (Ayodhya Ram Mandir )కోసం గుజరాత్ కు చెందిన భక్తులు (gujarat devotees)భారీ అగరుబత్తీని తయారు చేశారు. పంచద్రవ్యాలతో భారీ అగరుబత్తీ(incense stick)ని తయారు చేసి రామయ్యపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ భారీ బత్తీని చేయటానికి భక్తులు ఎంతోమంది కష్టపడ్డారు. ఇష్టమైనది ఏదీ కష్టం కాదంటున్న భక్తులు అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడువు గల అగరుబత్తీని పంచద్రవ్యాలతో తయారు చేశామని తెలిపారు.

విహాభాయ్ బర్వాద్ (Vihabhai Barwad) అనే ఓ భక్తుడి నేతృత్వంలో ఈ బాహుబలి అగరుబత్తీని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3,403 కిలోల బరువు ఉన్న అగరుబత్తీ తయారీ శ్రీరాముడిపై తమకున్న భక్తికి ప్రతీక అంటూ చెప్పుకొచ్చారు విహాభాయ్‌ భర్వాడ్‌. 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ బాహుబలి బత్తీ తయారు చేయటానికి రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు.

ఈ బత్తీ తయారీలో పంచ ద్రవ్యాలు వినియోగించామని తెలిపారు. అయోధ్యలో భక్తుల సమక్షంలో  అగర్ బత్తీని వెలిగిస్తామని..దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు. దీన్ని ఇక్కడి నుంచి అయోధ్యకు తరలించటానికి మరో రూ.4.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ బత్తీని వెలిగించే కార్యక్రమానికి మా సీఎం భూపేంద్ర పటేల్ (gujarat chief minister bhupendra pa)ను ఆహ్వానిస్తామని వెల్లడించారు.

అగరుబత్తీలో వినియోగించిన పదార్ధాలు..
191 కిలోల ఆవునెయ్యి
376 కిలోల గుగ్గిలం పొడి
280 కిలోల బార్లీ
280 కిలోల నువ్వులు
280 కిలోల కందిపప్పు,
376 కిలోల కొబ్బరిపొడి
425 కిలోల పూర్ణాహుతి సామగ్రి
1,475 కిలోల ఆవుపేడ

 

ట్రెండింగ్ వార్తలు