అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో రోటీతో పాటు బంగారం తిన్నాం: సారా అలీ ఖాన్

వారు మాకు రోటీతో బంగారం వడ్డించారు. రోటీలతో పాటు మేం బంగారం తిన్నాం. అక్కడ ప్రతిచోటా వజ్రాలు ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ చమత్కరించింది.

Sara Ali Khan: అంబానీ ఫ్యామిలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇటీవల అత్యంత వైభవంగా జరిగాయి. మార్చిలో జామ్‌ నగర్‌లో, తర్వాత మే నెల చివరలో యూరోపియన్‌ క్రూయిజ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రికెటర్లు, బడా వ్యాపారవేత్తలు, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు. జామ్‌ నగర్‌ వేడుకల్లో సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ఆమీర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ తమ ఆటపాటలతో అదరగొట్టారు.

జామ్‌ నగర్‌ సెలెబ్రేషన్స్ విశేషాలను బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తాజాగా మీడియాతో పంచుకుంది. అతిథులకు చపాతీలతో పాటు బంగారం వడ్డించారంటూ జోక్ చేసింది. “వారు మాకు రోటీతో బంగారం వడ్డించారు. రోటీలతో పాటు మేం బంగారం తిన్నాం. అక్కడ ప్రతిచోటా వజ్రాలు ఉన్నాయ”ని మిడ్-డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ చమత్కరించింది. మీడియాలో ఊహించి రాసినట్టుగా అక్కడేమీ లేదని పేర్కొంటూ.. అతిథులను అంబానీ ఫ్యామిలీ చాలా ప్రేమగా, అప్యాయంగా స్వాగతించారని తెలిపింది. కాగా, ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో అనంత్‌తో కలిసి సారా చదువుకుంది. రాధిక కూడా ఆమెకు చిన్నప్పటి నుంచి తెలుసు.

Also Read: నిజంగానే ‘కల్కి’ సినిమాలో ఒక్కొక్కరికి రెమ్యునరేషన్స్ అంత ఇచ్చారా? హీరో ప్రభాస్‌కి ఏకంగా..

జామ్‌నగర్‌లో జరిగిన మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మోస్ట్ మెమరబుల్ మూవెంట్ గురించి అడగ్గా.. హస్తాక్షర్ పేపర్‌పై అనంత్, రాధిక సంతకం చేసి ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం తనకు మరపురాని క్షణంగా అనిపించిందని సారా సమాధానం ఇచ్చింది. ఇక నటీనటులు ఏమేం ధరించారనే దానిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించారని, ఇది తమకు చాలా సరదాగా ఉందన్నారు. కాగా, ఇండియన్ రిచెస్ట్ మ్యాన్ ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌ తో జూలై 12న జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. జూన్ 29న యాంటిలియాలో పూజ కార్యక్రమంతో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.

Also Read: మేనత్తతో క్లిన్ కారా.. చరణ్ కూతురు ఫస్ట్ బర్త్‌డే ఫొటోలు.. ఇప్పటికి కూడా ఫేస్ చూపించట్లేదుగా..

ట్రెండింగ్ వార్తలు