Klin Kaara : మేనత్తతో క్లిన్ కారా.. చరణ్ కూతురు ఫస్ట్ బర్త్‌డే ఫొటోలు.. ఇప్పటికి కూడా ఫేస్ చూపించట్లేదుగా..

మెగా ఫ్యామిలీ సైలెంట్ గా కేవలం మెగా ఫ్యామిలీ మధ్యే క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.

Klin Kaara : మేనత్తతో క్లిన్ కారా.. చరణ్ కూతురు ఫస్ట్ బర్త్‌డే ఫొటోలు.. ఇప్పటికి కూడా ఫేస్ చూపించట్లేదుగా..

Ram Charan Sister Sushmita Konidela Shares Klin Kaara Photos

Updated On : June 22, 2024 / 3:02 PM IST

Klin Kaara – Sushmita Konidela : రామ్ చరణ్ – ఉపాసనల కూతురు క్లిన్ కారా ఇటీవలే జూన్ 20న మొదటి పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకు కూడా ఫేస్ చూపించలేదు. మెగా అభిమానులు కనీసం ఫస్ట్ బర్త్ డే అయినా సెలబ్రేషన్స్ చేస్తారు, ఫోటోలు బయటకు రిలీజ్ చేస్తారు, క్లిన్ కారా ఫేస్ చూపిస్తారు అనుకున్నారు. కానీ ఇవేమి జరగలేదు.

Also Read : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో మాళవిక నాయర్.. ట్రైల‌ర్ చూసేంత వ‌ర‌కు తెలియ‌దుగా..!

మెగా ఫ్యామిలీ సైలెంట్ గా కేవలం మెగా ఫ్యామిలీ మధ్యే క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫోటోలు కూడా ఎక్కడా బయటకు రానివ్వలేదు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందారు. అయితే క్లిన్ కారా మేనత్త అంటే చరణ్ సోదరి సుష్మిత క్లిన్ కారాని ఎత్తుకున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుష్మిత కొణిదెల క్లిన్ కారాతో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. హ్యాపీ ఫస్ట్ బర్త్ డే మై సీటెస్ట్. అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది అని పోస్ట్ చేసింది. దీంతో సుష్మిత పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోల్లో కూడా క్లిన్ కారా ఫేస్ చూపించకపోవడం గమనార్హం.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

మొత్తానికి క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే ఫోటోలు బయటకు రాకపోయినా సుష్మిత కొణిదెల మాత్రం ఈ ఫోటోలు షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ వీటిని వైరల్ చేస్తున్నారు.