Kalki Artists Remunerations : నిజంగానే ‘కల్కి’ సినిమాలో ఒక్కొక్కరికి రెమ్యునరేషన్స్ అంత ఇచ్చారా? ప్రభాస్ కి ఏకంగా..

కల్కి సినిమాని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారని ముందు నుంచి చెప్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లో సగం ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కే అయిందట.

Kalki Artists Remunerations : నిజంగానే ‘కల్కి’ సినిమాలో ఒక్కొక్కరికి రెమ్యునరేషన్స్ అంత ఇచ్చారా? ప్రభాస్ కి ఏకంగా..

Kalki Movie Prabhas Kamal Haasan Amitabh Deepika Disha so Many Artist Remunerations

Kalki Movie Artists Remunerations : ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ తో, సాంగ్ తో సినిమాపై భారీ ఆంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని, సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారని మూవీ టీమ్ చెప్పడంతో ఈ సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కల్కి సినిమాని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారని ముందు నుంచి చెప్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లో సగం ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కే అయిందట. కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి స్టార్స్ తో పాటు దిశా పటాని, అన్నా బెన్, మాళవిక నాయర్, శోభన, రాజేంద్రప్రసాద్.. లాంటి స్టార్ నటీనటులు కూడా ఉన్నారు. అంతేకాకుండా మృణాల్, దుల్కర్, విజయ్ దేవరకొండ, నాని.. లాంటి చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారని టాక్ నడుస్తుంది.

Also Read : Kalki Theatrical Business : ‘కల్కి’ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి..?

అయితే కల్కి సినిమాకు ప్రభాస్ కి దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చారంట. అలాగే అమితాబ్, కమల్, దీపికా ముగ్గురికి 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్, దిశా పటానికి 5 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడికే 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్స్ అయ్యాయి. మిగిలిన నటీనటులు, స్టార్ టెక్నిషియన్స్ తో కలిపి ఆల్మోస్ట్ 200 కోట్లు రెమ్యునరేషన్స్ కే అయిందని సమాచారం. ఆ తర్వాత గ్రాఫిక్స్ కే ఎక్కువ ఖర్చుపెట్టారట మూవీ టీమ్. ఇక ఈ సినిమా జూన్ 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.