Cannabis : గంజాయికి డబ్బు ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన బీహార్ లోని పాట్నా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాట్నా జిల్లా పాలి గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్, ప్రిన్స్ కుమార్ స్నేహితులు. ప్రిన్స్ కుమార్ ప్రతి రోజు గంజాయి తాగుతుంటాడు. అయితే శనివారం గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ప్రదీప్ వద్దకు వచ్చి అడిగాడు.
ప్రదీప్ తన దగ్గర డబ్బులేదని సమాధానం చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య మాట, మాట పెరిగింది. ప్రిన్స్ విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో ప్రదీప్ ఛాతీపై నాలుగు సార్లు పొడిచాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడికోసం గాలింపు చేపట్టారు.
గంజాయి కోసం ప్రాణస్నేహితుడిని చంపడంతో స్థానికంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. నిందితుడి తల్లిదండ్రులతో స్థానికులు గొడవకు దిగారు. పోలీసులు సర్దిచెప్పి పంపారు. నిందితుడి కోసం రెండు టీమ్ లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.