Taj Mahal: తాజ్ మహల్ గదులు తెరవాలన్న పిటిషనర్.. హైకోర్టు ఆగ్రహం

తాజ్ మహల్‌లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ‌కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్‌లో కోరాడు.

Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అది ఒకప్పుడు హిందూ దేవాలయమని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక వ్యక్తి ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్‌లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ‌కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్‌లో కోరాడు. అయితే, హైకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ డీ.కే.ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం ఈ పిల్ తిరస్కరించింది. ఇలాంటి అంశాల్ని చర్చించాల్సింది డ్రాయింగ్ రూమ్‌లో అని, కోర్టు రూమ్‌లో కాదని వ్యాఖ్యానించింది.

Taj Mahal: తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, షాజహాన్ లాక్కున్నాడు: పత్రాలు కూడా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ

‘‘ఏదైనా అంశంపై కావాలంటే రీసెర్చ్ చేయండి. దీనికోసం ముందుగా ఎమ్.ఏ. చదవండి. ఆ తర్వాత పీహెచ్‌డీ చేయండి. ఏ యూనివర్సిటీ అయినా, మిమ్మల్ని రీసెర్చ్ చేయనివ్వకపోతే తిరిగి మా దగ్గరికే రండి’’ అని కోర్టు పిటిషనర్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాలు కోర్టులో చట్టం ముందు చర్చించాల్సినవి కావని, దీనికోసం జడ్జీలేం శిక్షణ తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ రోజు తాజ్ మహల్ గురించి అడిగారు. రేపు జడ్జీల చాంబర్ గురించి అడుగుతారు. చట్టం కల్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్ని ఇలా అపహాస్యం చేయకండి’’ అని కోర్టు సూచించింది.

ట్రెండింగ్ వార్తలు