చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది.

Chandrababu Naidu Security: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర సర్కారు భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు భద్రత కల్పించనున్నారు. రెండు బ్యాచ్లుగా 12×12 విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం.

జూన్ 19 వరకు అప్రమత్తం: ఇంటెలిజెన్స్
జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది.

Also Read: ఖాతాల్లోకి డబ్బులు..! పథకాల లబ్దిదారులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

కాగా, ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు