Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇటలీ కళ్లద్దాలు తీసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని రాహుల్‌కు చురకలంటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివాంర జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.

Amit Shah to Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇటలీ కళ్లద్దాలు తీసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని రాహుల్‌కు చురకలంటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివాంర జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ పైనా విమర్శలు చేశారు.

Assam Homes Demolished: పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇళ్లు కూల్చివేత

‘‘ఎనిమిదేళ్లలో మోదీ ఏం చేశాడని కాంగ్రెస్‌లోని కొంతమంది మిత్రులు అడుగుతుంటారు. కానీ, ఇక్కడున్న (అరుణాచల్ ప్రదేశ్) మీరంతా చెప్పండి. ఎవరైనా కళ్లు మూసుకుని ఉంటే అభివృద్ధిని ఎలా చూడగలరని? కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూడాలనుకుంటున్నారు. మీ ఇటలీ కళ్లద్దాలు తీసి, భారత దేశపు కళ్లద్దాలు పెట్టుకోండి. అప్పుడు ఎనిమిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో కనిపిస్తుంది. ఎనిమిదేళ్లలో పర్యాటక రంగాన్ని, లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేశాం. యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఎనిమిదేళ్లలో చేసి చూపించాం’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు

ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రాలను మోదీ అనేక సార్లు సందర్శించారని, మంత్రులు కూడా ఇక్కడికి వచ్చేలా చేశారని, దీన్నిబట్టి ఆయన ఈ రాష్ట్రాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని షా అన్నారు. లండన్‌లో శుక్రవారం జరిగిన ఒక ఈవెంట్‌లో బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదరుదాడి చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు