Apple Watch : ఈ ఆపిల్ వాచ్.. మీ హార్ట్‌బీట్‌లో తేడా ఉన్నా చెప్పేస్తుంది.. డెడ్లీ ట్యూమర్లను పసిగట్టేస్తుంది!

ఆరోగ్య సమస్యలేవి చెప్పి రావు.. అనుకోకుండా వచ్చిపడతాయి. సమయానికి వైద్యసాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అసలు వచ్చే ఆరోగ్య సమస్య చిన్నదా పెద్దదా అనేది తేల్చుకోలేం.

Apple Watch : ఆరోగ్య సమస్యలేవి చెప్పి రావు.. అనుకోకుండా వచ్చిపడతాయి. సమయానికి వైద్యసాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అసలు వచ్చే ఆరోగ్య సమస్య చిన్నదా పెద్దదా అనేది తేల్చుకోలేం. తీరా పరిస్థితి విషమించేంతవరకు ఏ విషయాన్ని గ్రహించలేం.. ప్రతిదీ స్కానింగ్ వంటి చేయించుకోలేరు. మరి ఇలాంటి పరిస్థితులను ముందుగానే పసిగట్టడం ఎలానంటే.. అందుకు ఆపిల్ వాచ్ ఉందిగా.. అంటుంది టెక్ దిగ్గజం.. ఆపిల్ ప్రొడక్టుల్లో ఒకటైన స్మార్ట్ వాచ్ లోనూ అనేక హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. శరీరంలో జరిగే మార్పులను క్షణాల వ్వవధిలో ముందే పసిగట్టి మనకు తెలియజేస్తాయి. ఆ సరైన సమయంలో స్పందించి వెంటనే వైద్య సాయాన్ని తీసుకోవాలి. అప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి సునాయసంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ ఒకటి వచ్చింది. ఈ ఆపిల్ వాచ్.. సాధారణ సాధారణ స్మార్ట్ వాచ్ కన్నా చాలా ఎక్కువ. సరైన సమయంలో అలర్ట్ చేయడం ద్వారా వేలాది మంది జీవితాలను రక్షించే డివైజ్‌గా నిలిచింది.

ఇప్పుడు అదే ఆపిల్ వాచ్.. ట్యూమర్లు వంటిని కూడా ముందుగానే పసిగట్టగలదట.. ఇటీవల ఓ వ్యక్తి శరీరంలో దాగిన ట్యూమర్‌ను సైతం గుర్తించి ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ యువతి శరీరంలో కణితి ఉంది. అప్పుడప్పుడు ఆమె హృదయ స్పందనల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు హార్ట్ బీట్ అసాధారణంగా మారిపోతున్నాయి. అక్కడే ఆపిల్ వాచ్ సరిగ్గా పనిచేస్తుంది. వాస్తవానికి ఈ ఆపిల్ వాచ్ ధరించిన మహిళ కొంతకాలం క్రితం వరకు ఆపిల్ వాచ్ గురించి పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఇదే ఆమె ప్రాణాలను కాపాడింది. CBS న్యూస్ ప్రకారం.. న్యూ ఇంగ్లాండ్‌లోని మైనేకు చెందిన ఒక మహిళకు మైక్సోమా అనే అరుదైన ట్యూమర్ ఉంది. అది కణితి వల్ల ఆమె గుండెకు అందే రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా స్ట్రోక్‌కు కారణమైంది.

Apple Watch Detects Deadly Tumor, Warns User About Irregular Heartbeat

అప్పుడే ఆమె ధరించిన ఆపిల్ వాచ్ అలర్ట్ చేస్తోంది. కానీ, ఆమె పట్టించుకోలేదు. ఎప్పుడైతే పరిస్థితి మరింత దారుణంగా మారిందో అప్పుడు మాత్రమే ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ఆపిల్ వాచ్ సిగ్నల్స్ ద్వారానే ఆమె ఆస్పత్రికి చేరుకుంది. ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ అని పిలిచే వైద్య పరిస్థితిగా చెబుతారు. ఆ సమయంలో హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఎమర్జెన్సీ రూంలో చేరింది. ఆ తర్వాత చికిత్స తీసుకున్నానని ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

ఆమె గుండె రక్త సరఫరా నిలిచిపోయి.. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుందని వైద్యులు ఆమెకు తెలియజేశారు. మీకు A-fib ఉందని మీకు ఎలా తెలుసునని వైద్యులు అడిగారు. నాకు తెలియదు నా చేతి ఆపిల్ వాచ్ నాకు చెప్పిందని తెలిపింది. మీలో హృదయ స్పందనల్లో తేడాలు మినహా కిమ్‌కు ఇతర లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. Apple 2020లో Afib అలర్ట్ సిస్టమ్‌ను రిలీజ్ చేసింది. ECG యాప్1, క్రమరహిత హృదయ రిథమ్ నోటిఫికేషన్ ఫీచర్, క్రమరహిత రిథమ్ అత్యంత సాధారణ AFib సంకేతాలను గుర్తిస్తుంది. వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఇలాంటి సమస్యను చికిత్స చేయకుండా వదిలేస్తే.. AFib అనేది స్ట్రోక్‌కు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో ఈ సమస్య రెండో అత్యంత సాధారణ కారణమని ఆపిల్ స్పష్టం చేసింది.

Read Also : Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు