Pushpa Steps : ముంబై లోకల్ ట్రైన్‌లో నైజీరియన్ అబ్బాయి పుష్ప స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..
పుష్ప 2 నుంచి ఇటీవల వచ్చిన పుష్ప పుష్ప.. సాంగ్, అందులో చెప్పు వదిలేసి చేసే స్టెప్పు బాగా వైరల్ అయింది.
- Saketh U
- Published On : May 16, 2024 / 09:13 AM IST
Noel Robinson Pushpa Steps in Mumbai Local Train Reel goes Viral
Pushpa Dance Steps : పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్, మేనరిజం అన్ని ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. వేరే దేశాల్లో కూడా పుష్ప బాగా వైరల్ అయింది. తగ్గేదెలా అంటూ, పుష్ప స్టెప్పులతోని రీల్స్ చేశారు. ఇక పుష్ప 2 కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 నుంచి ఇటీవల వచ్చిన పుష్ప పుష్ప.. సాంగ్, అందులో చెప్పు వదిలేసి చేసే స్టెప్పు బాగా వైరల్ అయింది. చాలామంది ఈ స్టెప్ ని రీల్స్ చేస్తున్నారు. నోయల్ రాబిన్‌సన్ అనే నైజీరియన్, జర్మన్ వ్యక్తి సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. పలు దేశాలు తిరుగుతూ అక్కడ లోకల్ వ్యక్తులతో డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తాడు. ఇటీవల ఇండియాకి రావడంతో ఇండియాలో పబ్లిక్ ప్లేసెస్ లో కూడా పలు రీల్స్ చేసాడు.
Also Read : Anasuya Bharadwaj : అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో ప్యాసింజర్స్ తో కలిసి పుష్ప పుష్ప స్టెప్ వేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రష్మిక మందన్న కూడా నోయల్ రాబిన్‌సన్ రీల్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడం గమనార్హం. దీంతో పుష్ప 2 సినిమాకి వేరే దేశాల్లో మరింత క్రేజ్ వస్తుంది. మీరు కూడా వైరల్ అవుతున్న ఆ రీల్ చూసేయండి.
