CM Nitish kumar : బీహార్ లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది : సీఎం నితీశ్ కుమార్  

బీహార్ లో 24 గంటల్లోనే భారీగా కరోనా కేసులు నమోదు కావటంతో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.

bihar covid 19 third wave begun : దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంటే థర్డ్ వేవ్ వచ్చేసిందా?అనే గుబులు పుట్టుకొస్తోంది. ప్రజల్లో నెలకొన్న ఈ భయం గురించి బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. శీతాకాలం కావడంతో గత సంవత్సరం వలెనే కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితులు చూస్తుంటే కోవిడ్ 19 ధర్డ్ వేవ్ మొదలైందని భావిస్తున్నామని నితీశ్ వెల్లడించారు.

Read more : Fire Accident : బీహార్ లోని గయ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

కాగా..ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్..ఇటీవల కాలంలో ఓమిక్రాన్ వైరస్ కేసులు, మరోవైపు సాధారణ కోవిడ్ కేసులతో పరిస్ధితి అల్లకల్లోలంగా మారుతోంది. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం నితీశ్ థర్డ్ వేవ్ వచ్చినట్లుగా భావిస్తున్నామని అందుకే కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. బీహార్ పక్క రాష్ట్రాలైన యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చినా బీహార్ లో అప్పుడే ఆ పరిస్ధితి రాలేదన్నారు. పరిస్ధితులు ఇంకా విషమిస్తే..రాత్రి పూట కర్ఫ్యూపై ఆలోచిస్తామని అన్నారు.

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం..54 మందికి పాజిటివ్..మంత్రికి రెండోసారి వైర‌స్ ఎటాక్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల్లో కరోనా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కానీ బీహార్లో పరిస్ధితి మాత్రం అంత దారుణంగా ఏమీ లేదనే చెప్పాలి. సాధారణ కోవిడ్ కేసులే నమోదవుతున్నాయి. కానీ ముందు జాగ్రత్తగా ప్రజల్ని అప్రమత్తం చేయటానికి..తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం అధికారులను అప్రమత్తం చేయటానికి సీఎం థర్డ్ వేర్ పరిస్థితుల్ని అంచనావేశారు. దానికి తగినట్లుగా కోవిడ్ 19 ధర్డ్ వేవ్ మొదలైందంటూ సీఎం నితీశ్ కుమార్ స్వయంగా ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది.

Read more : Telangana High Court : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలి..హైకోర్టులో విచారణ

కేసులు నమోదవుతున్న అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోవిడ్ కేసుల వ్యాప్తికి కారణాల్ని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీ నుంచి రాకపోకలతోనే ఈ కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. సీఎం నితీశ్ రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్డ్ వేవ్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు