TS EAMCET Answer Key 2024 : టీఎస్ ఎంసెట్ ఆన్సర్ కీ 2024 ఇదిగో.. ఈ గడువు తేదీల్లోగా మీ అభ్యంతరాలను తెలపండి!

TS EAMCET Answer Key 2024 : టీఎస్ ఎంసెట్ అభ్యర్థులు ఇంజినీరింగ్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలపడానికి గడువు మే 14, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు మే 13 వరకు గడువు ఉంది.

TS EAMCET Answer Key 2024 ( Image Credit : Google )

TS EAMCET Answer Key 2024 : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2024కి సంబంధించిన ఆన్సర్ కీ, ఇంజినీరింగ్ (ఇ) అగ్రికల్చర్, మెడికల్ (AM) స్ట్రీమ్‌లు రెండింటికీ రెస్పాండ్ షీట్‌తో రిలీజ్ చేసింది. ఈ మెటీరియల్స్ అధికారిక వెబ్‌సైట్ (eamcet.tsche.ac.in)లో అందుబాటులో ఉంటాయి. ఇంజినీరింగ్ ఆన్సర్ కీకి సంబంధించి అభ్యంతరాలను తెలపడానికి గడువు మే 14 కాగా, స్ట్రీమ్‌కు మే 13 వరకు గడువు ఉంటుంది.

Read Also : CBSE Exam 2024 Results : సీబీఎస్ఈ బోర్డు పరీక్ష 2024 ఫలితాలు.. మేలో ఎప్పుడైనా ప్రకటించే ఛాన్స్!

అధికారిక నోటీసు ప్రకారం.. టీఎస్ ఈఏపీసెట్-2024 ఇంజనీరింగ్ (ఇ) స్ట్రీమ్ కోసం ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాండ్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్‌లోడ్ ఆప్షన్.. మే 12 ఉదయం 10 గంటల నుంచి మే 14 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అదే విధంగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (A & P) స్ట్రీమ్‌పై మే 11 ఉదయం 11 నుంచి మే 13 ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సమయం వరకు అభ్యర్థుల అభ్యంతరాలను అంగీకరిస్తారు.

టీఎస్ ఎంసెట్ 2024 : ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేయండిలా :

  • అధికారిక వెబ్‌సైట్ (eamcet.tsche.ac.in)ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీ దిగువన ‘TS EAMCET 2024 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయండి’ అనే లింక్‌ నావిగేట్ చేయండి.
  • లాగిన్ కోసం నెక్స్ట్ పేజీలో మీ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (DoB) ఎంటర్ చేయండి, ఆపై Submit చేయండి.
  • మీ ఆన్సర్ కీ.. మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • టీఎస్ ఎంసెట్ 2024 జవాబు కీని రివ్యూ చేసి ఆపై డౌన్‌లోడ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం టీఎస్ ఎంసెట్ తాత్కాలిక ఆన్సర్ కీ కాపీని ప్రింట్ తీసుకోండి.

టీఎస్ ఎంసెట్ 2024 అభ్యంతరాలు ఇలా తెలపండి :

  • మీ సమాధానంపై అభ్యంతరాల కోసం అబ్జెక్సన్ విండోలో క్లిక్ చేయండి.
  • మీ ఏ ప్రశ్నపై అభ్యంతరాలను తెలిపాలో దాన్ని ఎంచుకోండి.
  • మీ అభ్యంతరానికి అవసరమైన వివరాలను అందించండి.
  • పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో ఏవైనా సంబంధిత సపోర్టు డాక్యుమెంట్లను అటాచ్ చేయండి.
  • రుసుములకు చెల్లించండి.
  • మీ అభ్యంతరాన్ని సమర్పించండి.
  • మీ రికార్డులను సేవ్ చేసేందుకు కన్ఫర్మేషన్ పేజీని అలాగే ఉంచండి.

అభ్యర్థులు టీఎస్ ఎంసెట్ 2024 ఆన్సర్ కీలో ఎన్ని ప్రశ్నలకైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కానీ, ఒక్కసారి మాత్రమే అని గమనించాలి. అభ్యంతరాలను జాబితా చేసేటప్పుడు, అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను అందించాలి. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం టీఎస్ ఎంసెట్ లేదా ఈఏపీసెట్ మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లకు మే 7, మే 8 తేదీల్లో పరీక్ష జరిగింది.

Read Also : CBSE Board Results : సీబీఎస్ఈ బోర్డు ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈ నెల 20లోపు ప్రకటించే ఛాన్స్..!

ట్రెండింగ్ వార్తలు