Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు

సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. తాజగా జరిగిన ఒక సంఘటన దీనికి మరో ఉదాహరణ. ఇటీవల స్కూల్ బ్యాగ్ ధరించి, ఒంటికాలితో నడుస్తున్న బిహార్ బాలికకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Bihar girl: సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. తాజగా జరిగిన ఒక సంఘటన దీనికి మరో ఉదాహరణ. ఇటీవల స్కూల్ బ్యాగ్ ధరించి, ఒంటికాలితో నడుస్తున్న బిహార్ బాలికకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఆ బాలికకు కృత్రిమ కాలు అమర్చేందుకు ముందుకొచ్చారు.

Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి

బిహార్‌లోని జముయ్ జిల్లాలో ఒక పల్లెటూరుకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు ఒక్క కాలు మాత్రమే ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తన కాలు పోగొట్టుకుంది. ఐదో తరగతి చదువుతున్న సీమా ఒంటికాలితోనే రోజూ స్కూల్‌కు వెళ్లొస్తుండేది. చదువుకోసం కష్టపడుతున్న సీమా సంకల్పం వీడియో చూసిన ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ వీడియో చూసి సోనూ సూద్‌తోపాటు చాలా మంది ప్రముఖులు స్పందించారు. బాలికకు కృత్రిమ కాలు అమర్చి సాయపడేందుకు ముందుకొచ్చారు. అయితే, వాళ్లెవరి సాయం లేకుండానే బిహార్ విద్యాశాఖ, చిన్నారికి కృత్రిమ కాలు అమర్చేందుకు ముందుకొచ్చింది. బిహార్ ఎడ్యేకేషన్ కౌన్సిల్, బగల్ పూర్ శాఖ ఆధ్వర్యంలో సీమ కాలికి సంబంధించిన కొలతలు తీసుకున్నారు. తర్వాత రెండురోజుల్లో కృత్రిమ కాలు తీసుకొచ్చి అమర్చారు. దీంతో ప్రస్తుతం సీమ రెండు కాళ్లతో నడవగలుగుతుంది.

Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్

ఇటీవల జముయ్ జిల్లా అధికారులు సీమకు ఒక ట్రై సైకిల్‌తోపాటు, వీల్‌ చైర్ కూడా అందించారు. మరోవైపు సీమ అంశం బిహార్ విద్యాశాఖను కూడా కదిలించింది. రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లలోపు పిల్లల్లో వైకల్యంతో ఇబ్బందిపడుతున్న వాళ్లందరిపై సర్వే చేయాలని నిర్ణయించింది. దివ్యాంగులైన విద్యార్థులకు తగిన రీతిలో సాయపడాలని విద్యాశాఖ భావిస్తోంది. సీమకు కాలు అమర్చడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియా పవర్ అంటూ పలువురు పేర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు