CBSE Class 12 Results 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 99.15 శాతం ఉత్తీర్ణతతో టాప్ 3లో తెలంగాణ!

CBSE Class 12 Results 2024 : సీబీఎస్‌ఈ 12వ తరగతి 2024 ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో లక్షద్వీప్ మొదటి స్థానంలో నిలవగా, 99.91 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ 99.15శాతం ఉత్తీర్ణత సాధించింది.

Telangana 99.15 pass percentage ( Image Credit : Google )

CBSE Class 12 Results 2024 : దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూసిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) బోర్డు 12వ తరగతి ఫలితాలను సోమవారం (మే 13న) విడుదల చేసింది. ఈ పరీక్షా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

Read Also : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

12వ తరగతి పరీక్షలకు మొత్తం 8,337 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 4,433 మంది బాలురు, 3,904 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 8,266 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12వ తరగతి విద్యార్థుల్లో బాలురు 98.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 99.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.

లక్షద్వీప్ మొదటి స్థానం.. కేరళ రెండో స్థానం :
సీబీఎస్‌ఈ 12వ తరగతి 2024 ఫలితాల్లో తెలంగాణ 99.15 శాతం ఉత్తీర్ణత సాధించింది. తద్వారా దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రాల వారీగా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో లక్షద్వీప్ మొదటి స్థానంలో నిలిచింది. 99.91 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ 99.15శాతం ఉత్తీర్ణత సాధించింది. అయితే, లక్షద్వీప్‌లో కేవలం 13 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరుకాగా, వారందరూ ఉత్తీర్ణులవ్వడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ఫలితాల డేటా ప్రకారం.. రాష్ట్రంలోని జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వి) విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమంగా నిలిచారు. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు 99.83 శాతం ఉత్తీర్ణతతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇండిపెండెంట్ కేటగిరీలో 99.08 శాతంతో ప్రైవేట్ పాఠశాలలు. 98.86తో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి.

Read Also : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలపై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

ట్రెండింగ్ వార్తలు