సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలపై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

Meme Fest On Social Media: పరీక్ష ఫలితాలు వచ్చే రోజు ఇంట్లో విద్యార్థులు తల్లిదండ్రుల ముందు ‘సంప్రదాయనీ.. సుప్పిని.. సుద్దపూసనీ’లా వ్యవహరిస్తుంటారని..

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలపై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఎంతో భయం ఉంటుంది. పరీక్షలు రాయడం కోసమే పుట్టాము అన్నట్లుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యవహరిస్తుంటారు. ఏడాది పాటు చదివిన చదువుకు ఫలితం వచ్చే రోజు నాడు విద్యార్థుల్లో మరింత భయం పెరుగుతుంది.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. పదో తరగతిలో 93.60 శాతం మంది, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వర్షం కురుస్తోంది. పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు కాలర్ ఎగరేసుకుని తిరిగితే, మార్కులు తక్కువ వచ్చిన వారు ఎవరి కంటికీ కనపడకుండా తిరుగుతుంటారని నెటిజన్లు కార్టూన్లు కూడా పోస్ట్ చేస్తున్నారు.

చాలా మంది విద్యార్థులు ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతుంటారని కొందరు మీమ్స్ సృష్టించారు. పరీక్ష ఫలితాలు వచ్చే రోజు ఇంట్లో విద్యార్థులు తల్లిదండ్రుల ముందు ‘సంప్రదాయనీ.. సుప్పిని.. సుద్దపూసనీ’లా వ్యవహరిస్తుంటారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్ మీకోసం..