AC Prices Hike : సమ్మర్‌కు ముందే బిగ్ షాక్.. కొత్త AC కొంటున్నారా? భారీగా పెరుగుతున్న ఏసీల ధరలు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
AC Prices Hike : మీరు ఏసీ కొనాలనుకుంటే ఇప్పడే వెళ్లి కొనేసుకోండి. ఎండలు పెరిగే కొద్ది ఏసీల ధరలు కూడా అమాంతం పెరగనున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్లు ఏసీల ధరలను భారీగా పెంచేశాయి. పూర్తి వివరాలివే
AC Prices Hike
- వేసవి ప్రారంభానికి ముందే భారీగా పెరుగుతున్న ఏసీల ధరలు
- ఏసీల కంపనీలు పోటీపడి ధరలు పెంచేస్తున్నాయి
- పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను తగ్గించుకునేందుకు ధరల పెంపు
- ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హిటాచీ ఏసీ ధరలు 5 నుంచి 7 శాతం పెంపు
AC Prices Hike : బాబోయ్.. ఇంకా వేసవి రానేలేదు.. అప్పుడే ఏసీలు ధరలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో పలు బ్రాండ్ల ఏసీలు ధరలు ఆకాశాన్నంటేశాయి. మీరు కొత్త ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. రానురాను మరికొన్ని బ్రాండ్ల ఏసీలు ధరలు అమాంతం పెరగనున్నాయి. వేసవికి ప్రారంభానికి ముందే రూమ్ ఎయిర్ కండిషనర్ ధరలు భారీగా పెంచేశాయి కంపెనీలు.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హిటాచీ వంటి బ్రాండ్లు ఇప్పటికే ఏసీల ధరలను పెంచాయి. మార్చిలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హిటాచీ ఏసీ ధరలను దాదాపు 5 నుంచి 7 శాతం పెంచాయని డీలర్లు నివేదించారు. బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు కూడా రాబోయే 3 నుంచి 10 రోజుల్లో ఏసీలు ధరలను భారీగా పెంచుతాయని భావిస్తున్నారు. ఈలోపే మీరు కొత్త ఏసీ కొని ఇంటికి తెచ్చుకోవడం మంచిది.
పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చు ఒత్తిడి :
పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను తయారీదారులు వినియోదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే వేసవి డిమాండ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముందుగానే బాదేస్తున్నారు. మార్చి త్రైమాసికంలో ఏసీల నిల్వలు ఇప్పటికే పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
అధిక డిమాండ్, ధరల పెరుగుదలను ఊహించి పంపిణీదారులు ఇన్వెంటరీని పెంచుతున్నారు. ముడి పదార్థాల ఖర్చులు, సరఫరా గొలుసు ఖర్చులు పెరగడంతో ఎయిర్ కండిషనర్ తయారీదారు డైకిన్ ఇండియా ఏప్రిల్ నుంచి 12శాతం ధరల పెరుగుదలను ప్రకటించింది.
12శాతం పెరగనున్న ఏసీల ధరలు :
ముడిసరుకు ఖర్చులు, సరఫరా గొలుసు ఖర్చుల పెరుగుదలతో ఏప్రిల్ 2026 నుంచి డైకిన్ ఇండియా ప్రొడక్టుల రేంజ్ ధరలను 7 శాతం నుంచి 12 శాతం పెంచుతుందని డైకిన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కాపర్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల ఈ ఏడాదిలో రూమ్ ఎయిర్ కండిషనర్ ధరలు 5 నుంచి 15 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ తెలిపింది.
కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే రాగి ధరలు పెరగడంతో సహా అనేక కారణాల వల్ల ఏసీ తయారీదారులు ధరలను పెంచుతున్నారు. మొత్తంమీద, ఈ ముడి పదార్థాలు ఏసీల తయారీ ఖర్చును పెంచాయి. ఇందులో చాలా వరకు విదేశాల నుంచే వస్తాయి. ఇంకా, కంపెనీలు కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. దాంతో కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు ఉత్పత్తి ఖర్చులను భారీగా పెంచుతున్నాయి.
మార్చి, మే మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. కమోడిటీ ద్రవ్యోల్బణం, నియంత్రణ మార్పుల కారణంగా ఏసీ ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరగవచ్చని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ అన్నారు.
దేశంలో అమ్ముడయ్యే ఏసీలు ఎన్నంటే :
భారతీయ రూమ్ ఎయిర్-కండిషనర్ మార్కెట్ దాదాపు 13.5 మిలియన్ యూనిట్లుగా అంచనా. ఇందులో వోల్టాస్, ఎల్జీ, డైకిన్, బ్లూస్టార్, పానాసోనిక్, లాయిడ్ వంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. జపనీస్ మల్టీనేషనల్ డైకిన్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ డైకిన్ ఇండియా కంపెనీ ఏసీల ధరల పెంచుతున్నట్టు ప్రకటించింది.
గత ఏడాదిలో భారీగా తగ్గిన అమ్మకాలు :
2025 సంవత్సరం రూమ్ ఎయిర్ కండిషనర్ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. ఎందుకంటే అకాల వర్షాలు, ఇతర అంశాలు అమ్మకాలను ప్రభావితం చేశాయి. 2024లో ఈ పరిశ్రమ బలమైన వృద్ధిని సాధించింది. ఈ సంవత్సరం దేశంలోని అనేక ప్రాంతాలలో తీవ్రమైన వేడి కనిపించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2026లో మార్కెట్ వాటా కోసం రూమ్ ఎయిర్ కండిషనర్ తయారీదారుల మధ్య తీవ్రమైన పోటీ పెరగనుంది.
