Cyclone Biparjoy to intensify : పోర్‌బందర్ తీరాన్ని తాకనున్న బిపర్ జోయ్ తుపాన్

బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....

Cyclone Biparjoy to intensify

Cyclone Biparjoy to intensify in next few hours: బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. ‘‘ఈస్ట్‌సెంట్రల్ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన తీవ్ర తుపాన్ బిపర్ జోయ్ గత 6 గంటల్లో ఉత్తరం వైపు 3 కిలోమీటర్ల వేగంతో కదిలింది. గోవాకు పశ్చిమ-వాయువ్యంగా 700 కిలోమీటర్ల దూరంలో అదే ప్రాంతంలో జూన్ 10వతేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్రీకృతమై ఉంది.

Kerala Welcomes Monsoon : కేరళను తాకిన రుతుపవనాలు.. వర్షం కోసం ముంబయి ఎదురుచూపులు

ముంబయికి పశ్చిమ నైరుతి దిశలో 620 కిలోమీటర్ల దూరంలో, పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతి దిశలో 580 కిలో మీటర్ల దూరంలో ఉంది’’ అని వాతావరణ శాఖ తెలిపింది.ఈ తుపాను గుజరాత్‌ను తాకకపోవచ్చు. పోర్‌బందర్ తీరానికి(Porbandar coast) కొంత దూరంలో ఈ తుపాన్ వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తన తాజా వెదర్ బులెటిన్ లో పేర్కొంది.నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ బృందాలను పోర్ బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ జిల్లాల్లో మోహరించారు.(Fishermen warned, NDRF teams dispatched)రాబోయే ఐదు రోజుల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

Train Fire Broke Out : ఏలూరు రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం

భారతీయ తీర రక్షక దళం గుజరాత్, డామన్, డయ్యూలోని మత్స్యకార సంఘం, నావికులకు అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరంలో నాలియాకు 200 కిలోమీటర్ల దూరంలో తుపాను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.తుపాను ప్రభావంతో గుజరాత్‌లో రానున్న ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన గాలివానలు వీస్తాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది.

Anam Ramanarayana Reddy : టీడీపీలోకి ఆనం.. ప్రకటన అప్పుడే?

రాబోయే రెండు రోజుల్లో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి’’ అని అహ్మదాబాద్ భారత వాతావరణ విభాగం కేంద్రం డైరెక్టర్ మనోరమ మొహంతి తెలిపారు.కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు