గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ

గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

Godavari Flood Rising at Bhadrachalam : భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇదే జరిగితే అధికారులు రెండోవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పర్ణశాలలో నారా చీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

అటు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గంట గంటకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. 8లక్షల 57వేల 707 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ మధ్యకు నీరు భారీగా చేరుకుంది. మరోసారి డయాప్రం వాల్ పూర్తిగా నీట మునిగింది. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read : ఊళ్లకు ఊళ్లని చుట్టేసిన వరద.. ముంపు ప్రాంతాల్లో కన్నీళ్లు మిగిల్చిన పెద్దవాగు

 

ట్రెండింగ్ వార్తలు