Indiramma Illu : రేవంత్ సర్కార్ శుభవార్త.. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన
Indiramma Illu : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
minister ponguleti srinivas reddy on second phase indiramma illu
Indiramma Illu : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని.. మిగతా 3 విడతల ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. అలానే రాష్ట్రంలో గూడాలు, మారుమూల గిరిజన తండాల్లో ప్రారంభించి.. వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని తెలిపారు.
ఈ ఏడాది జూన్-జూలై నాటికి మంజూరైన మొదటి విడత ఇళ్లలో దాదాపు 99 శాతం పూర్తవుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతుందని తెలిపారు. “పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
